2019 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి దారుణమమైన పరాజయం అనంతరం తెలుగుదేశం అభిమానులతోపాటు సగటు ప్రజలందరూ సదరు పార్టీ ఓడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీకి సరైన నాయకత్వ సారధి లేకపోవడమే అని గ్రహించారు. చంద్రబాబు తరువాత పార్టీని ఆదుకోనే సత్తా కేవలం జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే ఉందని ఆల్మోస్ట్ ఒక డెసిషన్ కు వచ్చేశారు. దాంతో ప్రస్తుతం సినిమాల్లో యమ బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఎప్పుడు పార్టీ పగ్గాలు అందుకోంటాడా అని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో.. బాలయ్య చిన్నల్లుడు భరత్ ఈ విషయమై చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.
టిడిపి పార్టీకి ఇప్పుడు ఎన్టీఆర్ అవసరం ఏముంది? వచ్చినా ఏం సాధించగలడు అని భరత్ చేసిన కామెంట్స్ కి నందమూరి అభిమానులు మాత్రమే కాదు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోయారు. ఎన్టీఆర్ కి తెలుగు తమ్ముళ్ళల్లో ఉన్న ఫాలోయింగ్ కానీ.. అతడు తాతయ్య ఎన్టీఆర్ తరహాలో చేసే ప్రచారం ఎలా ఉంటుందో ఆల్రెడీ తెలుగు తమ్ముళ్ళకు తెలుసు. అందుకే.. ఎన్టీఆర్ ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడా అని ఎదురుచూస్తున్నారు జనాలు. ఇలాంటి తరుణంలో భరత్ ఇలాంటి కామెంట్స్ చేయడం స్వాగతించలేని విషయం.