బాలయ్య తన కొడుకుతో అప్పుడే అంత రిస్క్ చేయిస్తాడా?

  • June 27, 2019 / 05:55 PM IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా బాలయ్య అభిమానులతో పాటు నందమూరి అభిమానులు కూడా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కానీ బాలయ్య మాత్రం మోక్షజ్ఞ విషయంలో అభిమానులకి ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే కొన్నేళ్లుగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా మారబోతున్నాడనే ప్రచారం జరుగుతూనే ఉంది. తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయేమో కానీ నందమూరి అభిమానులకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. తాజాగా మోక్షజ్ఞ గురించి మరో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకొచ్చింది.

బాలకృష్ణ ఇటీవల సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుని కలిశాడట. బాలయ్య, సింగీతం కాంబోలో ‘ఆదిత్య 369’ ‘భైరవ ద్వీపం’ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆదిత్య 369 సీక్వెల్ ఉంటుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ ఆ సీక్వెల్ లో నటించబోతున్నాడని అందుకే ఇలా బాలయ్య .. సింగీతం శ్రీనివాసరావు ను కలిసి ఉంటారని ప్రచారం జరుగుతుంది. అయితే మోక్షజ్ఞ పై నందమూరి అభిమానులకి ఎన్నో అంచనాలు ఉన్నాయి. తనని ఓ మంచి మాస్ ఎంటర్టైనర్ లో చూడాలని వారి ఆశ. ఈ విషయం బాలయ్య కి కూడా తెలుసు అందుకే ఇంత గ్యాప్ తీసుకున్నారు. మొదటి సినిమాతోనే తన కొడుకుతో ఇలాంటి ప్రయోగాలు చేయించే అవకాశం లేదని బాలయ్య సన్నిహిత వర్గం చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus