Balakrishna: అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న బాలకృష్ణ!

  • December 1, 2021 / 05:43 PM IST

ఈ మధ్య కాలంలో ఆహా ఓటీటీలో వరుసగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్ గా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ షో తొలి ఎపిసోడ్ కు మోహన్ బాబు గెస్ట్ గా హాజరు కాగా రెండో ఎపిసోడ్ కు నాని గెస్ట్ గా హాజరయ్యారు. ఈ షో అరుదైన రికార్డులను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ షో మూడో ఎపిసోడ్ కు బ్రహ్మానందం, అనిల్ రావిపూడి గెస్టులుగా హాజరయ్యారు.

ఆహా ఓటీటీలో ఎక్కువ ప్లే వ్యూస్ వచ్చిన టాక్ షోగా ఈ షో నిలవడం గమనార్హం. ఇప్పటికే ఈ ఓటీటీలో పలు టాక్ షోలు ప్రసారం కాగా ఆ షోలను మించి అన్ స్టాపబుల్ షో రికార్డులను సొంతం చేసుకుంది. అతి త్వరలో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి హాజరైన ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బాలకృష్ణ ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు టాక్ షోతో బిజీగా ఉన్నారు. అన్ స్టాపబుల్ షోకు రాబోయే వారాల్లో మరి కొందరు సినీ ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం.

బాలయ్య భవిష్యత్తు సినిమాలలో ఒక సినిమా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కనుండగా మరో సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాల షూటింగ్ లు మొదలు కానున్నాయి. బాలయ్యకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, పాపులారిటీ వల్లే అన్ స్టాపబుల్ టాక్ షో హిట్టైంది. బాలయ్య భవిష్యత్తులో మరిన్ని రియాలిటీ షొలకు హోస్ట్ గా వ్యవహరిస్తారేమో చూడాల్సి ఉంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus