అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు శివుడు, రాముడు, కృష్ణుడు లాంటి పాత్రలు పోషిస్తున్నప్పుడు మద్యం సేవించడం, సిగరెట్ తాగడం, మాంసాహారం తినడం లాంటివి మానేసేవారట. అలాగే.. సదరు సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులూ కటిక నేల మీద నిదురించేవారట. అందుకే ఆయన పోషించే పాత్రల్లో సహజత్వం, ఆయన ముఖంలో దైవత్వం తొణికిసలాడేవి. ఇప్పుడు ఆయన తనయుడు బాలకృష్ణ కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. త్వరలో ఆయన తన తండ్రి ఎన్టీఆర్ జీవితం ఆధారంగా “ఎన్టీఆర్” బయోపిక్ లో టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలయ్య దాదాపు 12 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.
ఇందుకోసం బాలకృష్ణ ఆల్రెడీ మందు, సిగరెట్ మానేశారట. అలాగే.. అందర్నీ ‘బ్రదర్’ అని పిలవడం మొదలెట్టారట. ఎందుకంటే అన్నగారు కూడా అందర్నీ వయోబేధం లేకుండా సరదాగా “బ్రదర్” అనే పిలిచేవారట. అలాగే.. నడక, మ్యానరిజమ్స్ విషయంలోనూ ఎన్టీఆర్ ను తలపించేలా బిహేవ్ చేస్తున్నాడట బాలయ్య. చూస్తుంటే.. “ఎన్టీఆర్” బయోపిక్ లో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ లా నటించడం కాదు, జీవించేలా ఉన్నారు.