Amigos: అమిగోస్ మూవీ ఈవెంట్ ను అలా ప్లాన్ చేశారా?

  • February 3, 2023 / 04:41 PM IST

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అమిగోస్ మూవీ ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే. అమిగోస్ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా అషికా రంగనాథ్ నటించారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో మూడు పాత్రలలో కనిపించనున్నారు. జై లవకుశ తరహాలో ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన అమిగోస్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ నెల 5వ తేదీన అమిగోస్ మూవీ ఈవెంట్ జరగనుంది. ట్రైలర్ ఈరోజే రిలీజ్ కానున్నా ఈవెంట్ మాత్రం ఆలస్యం కానుంది. ఈ ఈవెంట్ కు బాలయ్య, ఎన్టీఆర్ హాజరు కానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ కలిసి కనిపించనుండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తారకరత్న ప్రస్తుతం ఆస్పత్రిలో ఉండటంతో ఈ ఈవెంట్ సింపుల్ గానే జరగనుందని తెలుస్తోంది.

బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు హాజరు కానున్నట్టు అధికారక ప్రకటన వెలువడింది. అమిగోస్ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 9 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. బింబిసార గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవగా అమిగోస్ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డెవిల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తే కళ్యాణ్ రామ్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus