బాలయ్య టైటిల్ కన్ఫర్మ్ చేశారు..!

  • April 5, 2016 / 05:20 AM IST

నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు యోధుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి టైటిల్ గా క్రిష్ నిర్మాణ సంస్థ ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’ వారు ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ అనే టైటిల్ నే రిజిస్టర్ చేయించారు. దీన్ని బట్టి ఈ చిత్రానికి క్రిష్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. నిర్మాణంలో ఎక్కువశాతం మాత్రం 14 రీల్స్ వారే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. బాలయ్య మార్కెట్ కు మించి ఈ చిత్రానికి ఖర్చుపెడుతుండడం విశేషం. ఉగాది రోజున ఈ సినిమా ప్రారంభం కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus