నందమూరి తారక రామారావు గారి తనయుడు నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందమూరి వారసుడిగా మాత్రమే కాకుండా బాలకృష్ణ ఇండస్ట్రీలో తన నటనతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలకృష్ణ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.
బాలకృష్ణ నటుడిగా మాత్రమే కాకుండా హోస్ట్ గా కూడా తన టాలెంట్ నిరూపించుకున్నాడు. ఆహా లో స్ట్రీమ్ అయిన అన్ స్టాపఅబుల్ విత్ ఎన్.బి.కె షో ద్వారా హోస్ట్ గా మారిన బాలకృష్ణ ఈ షోలో పార్టిసిపేట్ చేసిన పలువురు సెలబ్రిటీలను ఆసక్తి కరమైన ప్రశ్నలు అడిగి వారివద్ద నుండి సమాధానం రాబట్టే వారు. మొత్తానికి ఈ రియాలిటీ షో కూడా సూపర్ సక్సెస్ సాధించింది. త్వరలో అన్ స్టాపఅబుల్ సీజన్ 2 కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా కరోనా సమయంలో విడుదలైన అఖండ సినిమా అరుదైన రికార్డులను క్రియేట్ చేసింది. సాధారణంగా ఈ రోజుల్లో సినిమాలు విడుదలై 50 రోజులు ఆడితే అదే గగనం అనుకోవాలి. కానీ బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఏకంగా ఐదు నెలల పాటు అంటే 175 రోజులు పూర్తి చేసుకుంది.గుంటూరు జిల్లా చిలకలూరి పేటలోని రామకృష్ణ థియేటర్లో అఖండ సినిమా 175 రోజులు ఆడి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
బాలకృష్ణ ఈ విషయంలో ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ అఖండ సినిమా 20 థియేటర్ లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ యాక్షన్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. సాధారణంగా ఓవర్సీస్ లో బాలకృష్ణ సినిమాలకు అంత మార్కెట్ ఉండదు. కానీ అఖండ సినిమ మాత్రం ఓవర్సీస్ లో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు.