బాలయ్యను బాగా వాడుకొంటున్నారు!

  • June 27, 2016 / 05:22 AM IST

“జక్కన్న” ట్రైలర్ లో సునీల్, సప్తగిరిల కామెడీ టైమింగ్ తోపాటు జనాల్ని బాగా నవ్వించిన మరో అంశం 30 పృధ్వీ పోలీస్ గెటప్ “సింహా” సినిమాలో బాలయ్య గెటప్ ను పోలి ఉండడంతోపాటు.. డైలాగులు కూడా అదే శైలిలో చెప్పించడం.

“ఒక్కసారి నేను సీన్ లోకి ఎంతరయ్యాక.. రాసిన రైటర్ కే డైలాగులుండవ్” అని పృధ్వీ బాలయ్యను అనుకరిస్తూ చెప్పిన డైలాగ్ అందర్నీ అమితంగా ఆకట్టుకొంది. పృధ్వీ ఈ విధంగా బాలయ్యను వాడుకోవడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు “లౌక్యం” సినిమాలో కూడా బాలయ్యను ఇమిటేట్ చేసే మంచి పేరు సంపాదించుకొన్నాడు. ఇప్పుడు “జక్కన్న”లో ఇంకెంచెం క్వాంటీటీ పెంచి.. ఈసారి బాలయ్యను బలంగా వాడేసినట్లు కనిపిస్తున్నాడు. ట్రైలర్ లోనే ఈ స్థాయిలో వాడితే.. ఇక సినిమాలో ఇంకే స్థాయిలో వాడి ఉంటారో? అని జనాలు తెగ ఆలోచించేస్తున్నారు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus