సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తృటిలో ప్రమాదంలో తప్పింది. ఆయన బుధవారం తెలుగుదేశం పార్టీ సభ్యులతో కలిసి హిందూపురం నుంచి బెంగుళూరు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. వేగంగా వెళ్తున్నబాలయ్య కారుకి సడన్ గా గేదె అడ్డు రావడంతో పక్కకు తిప్పాడు. అప్పుడు కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదం కర్ణాటకలోని బాగేపల్లి వద్ద జరిగింది.
ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతింది. లోపల ఉన్న బాలకృష్ణ, ఇతర సభ్యులకు ఎటువంటి గాయాలు తగలలేదు. వాహనం నుంచి క్షేమంగా బయట పడిన బాలయ్య వేరే కారులో బెంగుళూరుకి చేరుకున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య తన నియోజక వర్గంలో ఈ రోజు సమావేశం ఉండడంతో హిందూపురంకు వెళ్లారు. మీటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఇలా జరిగింది. ప్రమాదం అని తెలియగానే బాలకృష్ణ కుటుంబ సభ్యులు, అభిమానులు, నియోజక వర్గ వాసులు కంగారు పడ్డారు. బాలయ్యకు ఏమి కాలేదనే సమాచారంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.