బోయపాటిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..!
- April 14, 2016 / 02:02 PM ISTByFilmy Focus
వైజాగ్‌లో సరైనోడు ఆడియో ఫంక్షన్‌లో చిరంజీవి మాట్లాడిన మాటలు నందమూరి ఫ్యాన్స్‌కు కోపం తెప్పించడంతో పాటు బోయపాటిని సైతం ఇరకాటంలో పడేశాయి. ఈ ఫంక్షన్‌లో చిరు.. బోయపాటి బాలయ్యతో తీసిన సింహా, లెజెండ్ సినిమా కథలను ముందుగా తాను విని పలు మార్పులు చేర్పులు చేస్తే వాటిని బోయపాటి కూడా తూచా తప్పకుండా అమలు చేశాడని అన్నారు. చిరుకు ఆ కథలు అంత నచ్చి, సలహాలిస్తే మరి వాటిలో ఆయన ఎందుకు నటించలేదని బాలయ్య ఫ్యాన్స్ చిరుపై మండిపడుతున్నారు. ఇక బోయపాటిని ఉద్దేశించి చిరు సలహాలిస్తుంటే బోయపాటి ఏం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బోయపాటిని టార్గెట్‌గా చేస్తూ పలుచోట్ల బాలయ్య ఫ్యాన్స్ ఆయన పోస్టర్లను తగలపెట్టే వరకు వ్యవహారం వచ్చింది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















