మహానటుడు నందమూరి తారక రామారావు మనవడు, నటసింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి ముహూర్తం ఖరారు అయింది. స్టడీ పూర్తి కాగానే మోక్షజ్ఞ కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కొడుకు సినిమాల్లో ఎంట్రీ పై బాలకృష్ణ మాట్లాడుతూ ” మోక్షజ్ఞ తప్పకుండా సినిమాలు చేస్తాడు. కాకపోతే అతను ప్రస్తుతం చదువుపైనే శ్రద్ధ పెట్టాడు. చదువు పూర్తయ్యాక రావాలనే ఆలోచనలోనే మోక్షజ్ఞ ఉన్నాడు.
అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది చివర్లో వెండి తెరపై కనిపిస్తాడు” అని స్పష్టం చేసాడు. కృష్ణా పుష్కరాల సందర్భంగా బాలకృష్ణ దంపతులు విజయవాడ దుర్గాఘాట్‌లో శుక్రవారం పుష్కర స్నానమాచరించారు. అనంతరం అయన మాట్లాడుతూ తెలుగువారికి అమరావతి ప్రాశస్త్యం పరిచయం చేసేందుకు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా తీస్తున్నట్లు చెప్పారు. “అశోకుడు, శ్రీకృష్ణ దేవరాయులు వీళ్లందరూ గొప్ప గొప్ప రాజులే కానీ మన తెలుగువాడు శాతకర్ణి గురించి మన వాళ్లకు తక్కువ తెలుసు. అటువంటి మహారాజు పాత్ర పోషిస్తున్నందుకు, ఆ సినిమాని ప్రజల ముందుకు తీసుకొస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది” అని బాలయ్య వెల్లడించారు.
జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం చిత్రీకరణ సంగతులను దగ్గరుండి తెలుసుకుంటున్న మోక్షజ్ఞను నందమూరి అభిమానులు తెరపైన చూసే సమయం ఎంతో దూరం లేదని అర్ధమయిపోయింది. అయితే “రానే వచ్చాడయ్యా .. ఆ రామయ్య” అనే టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసింది.. ఇతనికోసమేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.