నందమూరి తారక రామారావుగారి వారసుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమా గౌతామీ పుత్ర శాతకర్ణి సినిమాతో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు అని స్పష్టంగా తెలుస్తుంది. అయితే తాజాగా జరిగిన బాలయ్య పుట్టిన రోజు వేడుకల్లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. సహజంగా సెలెబ్రేటీస్ తమ బిజీ బిజీగా గడుపుతూ తమ పర్సనల్ లైఫ్ ను మిస్ అవుతూ ఉంటారు.
అయితే బాలయ్య మాత్రం ఎక్కడా దేనికి లోటు రాకుండా….అన్నింటినీ సూపర్ గా మ్యానేజ్ చేస్తున్నారు..ఇంతకీ విషయం ఏమిటంటే…బర్త్‌డే వేడుకలకు అమెరికా వెళ్ళిన బాలయ్య…ఒక పక్క ఫాన్స్ కి సంతోషాన్ని ఇస్తూనే తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఈవెంట్స్ లో బిజీగా గడిపారు. తన ఫాన్స్ తో కలిసి బసవతారకం ఆసుపత్రి నిమిత్తం ఫండ్స్ కలక్షన్ లలో బిజీ గా ఉంటూనే….తన రెండవ కూతురు తేజస్విని కాలిఫోర్నియా లో సాంతాకార్లా యూనివర్సిటీ లో ఎంబీయే పూర్తిన సంధర్భంగా కాన్వకేషన్ లో పట్టా అందుకునే సమయం లో బాలకృష్ణ అక్కడికి వెళ్ళారు తన భార్య తో కలిసి తేజస్విని తో స్పెండ్ చేశారట.
ఇక ఈ కార్యక్రమంలో తేజస్విని భర్త శ్రీ భరత్ కూడా పాల్గొనడం తో సరిగ్గా తన పట్టా తీసుకునే సమయం లో తల్లీ – తండ్రీ, భర్త అందరూ తన దగ్గర ఉండడం తో తేజస్వి చాలా సంతోషంగా ఉందట. ఏది ఏమైనా…ఒక పక్క ఫాన్స్ ని సంతృప్తి పరుస్తూ, ఫ్యామిలీ విషయాలు చూసుకుంటూ, ట్రస్ట్ కోసం ఫండ్స్ కలక్ట్ చేస్తూ, ప్రభుత్వ వ్యవహరాలు చూస్తూ…అందుకే మరి బాలయ్యని అందరూ…”ఒక్క మగాడు”అనేది…