నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకూ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం వలన తన చిత్రం పై ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో తన తదుపరి చిత్రం గురించి డిస్కషన్లు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. తనకి రెండు హిట్లిచ్చిన ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఈ చిత్రం ఉండనుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే బోయపాటి ఇంకా స్క్రిప్ట్ పనుల్లోనే ఉన్నాడట.
పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిన తరువాతే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుందని తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం… బాలయ్య ఓ కన్నడ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే… కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా ‘భైరతి రణగళ్’ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ఓ పవర్ఫుల్ రోల్ ఉండటంతో… దీని కోసం బాలయ్యను సంప్రదించారని తెలుస్తుంది. ఇందుకు బాలయ్య కూడా ఓకే చెప్పేశారని సమాచారం. శివరాజ్ కుమార్ తో బాలయ్యకు మంచి సాన్నిహిత్యం ఉండటంతో బాలకృష్ణ ఈ రోల్ చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.