Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » 14 వ సారి తలపడనున్న చిరంజీవి, బాలకృష్ణ

14 వ సారి తలపడనున్న చిరంజీవి, బాలకృష్ణ

  • December 29, 2016 / 01:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

14 వ సారి తలపడనున్న చిరంజీవి, బాలకృష్ణ

తెలుగు హీరోలకు సంక్రాంతి ప్రత్యేక పండుగ. ఆ పెద్ద పండుగనాడు తమ సినిమాలతో బరిలోకి దిగుతారు. పోటీ నీదా.. నాదా.. అంటూ సవాల్ విసురుతారు. ఈ ఆనవాయితీ ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి ఉంది. రెండో తరం హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ మధ్య కొన్నేళ్లుగా పోటీ కొనసాగింది. ఒక సారి మెగాస్టార్ మూవీ హిట్ కొడితే మరో సారీ బాలయ్య ప్రతాపం చూపించేవారు. ఇప్పటి వరకు కేవలం పెద్ద పండుగనాడు మాత్రమే 8 సార్లు, ఇతర సందర్భాల్లో ఐదు సార్లు ఈ స్టార్ హీరోల సినిమాలు పోటీకి దిగాయి. చివరి సారి వీరిద్దరూ 2004 లో తల పడ్డారు. మళ్లీ పదమూడేళ్ల తర్వాత సీనియర్ హీరోల చిత్రాలు పోటీ పడనున్నాయి. చిరు ఖైదీ నంబర్ 150 అంటూ వస్తుండగా, బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి గా యుద్ధానికి ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దపండుగతో పాటు మిగిలిన రోజుల్లో పోటీ పడిన చిరు, బాలయ్య చిత్రాలపై ఫోకస్..

మంగమ్మగారి మనవడు – ఇంటిగుట్టుChiranjeevi, Balakrishnaబాలకృష్ణ, చిరంజీవికి భారీగా అభిమానసంఘాలు ఏర్పడుతున్న రోజులవి. 1984 సంవత్సరం లో తొమ్మిదో నెలలో ఇద్దరూ తమ చిత్రాలతో బరిలోకి దిగారు. మూడవ తేదీన మంగమ్మగారి మనవడు చిత్రంతో బాలకృష్ణ రాగా, మూడు రోజుల తర్వాత ఇంటి గుట్టుతో చిరంజీవి వచ్చారు. ఈ రెండింటిలో సుహాసిని ప్రధాన కథానాయికగా నటించింది. మంగమ్మగారి మనవడు మాత్రం సూపర్ హిట్ అయి ఆమెకు మంచి పేరుతెచ్చి పెట్టింది.

కథానాయకుడు – రుస్తుంChiranjeevi, Balakrishna1984 లోనే రెండో సారి యుద్ధంలోకి దిగారు. డిసెంబర్ 14 న బాలయ్య కథానాయకుడి చిత్రం రిలీజ్ కాగా వారం తర్వాత 21 వ తేదీన చిరు రుస్తుం విడుదలయింది. ఈ చిత్రంలో యాక్షన్ తో మెగాస్టార్ అదరగొట్టారు. హిట్ అందుకున్నారు. కథానాయకుడు పేరులో బలమున్నప్పటికీ సినిమాలో లేకుండా పోయింది.

ఆత్మబలం – చట్టంతో పోరాటంChiranjeevi, Balakrishna1984 లో చిరంజీవి చిత్రాలు పది రిలీజ్ అయ్యాయి. 1985 లో 8 చిత్రాలు విడుదల అయ్యాయి. అందులో చట్టంతో పోరాటం సంక్రాంతికి రిలీజ్ అయి బాలయ్య ఆత్మబలం మూవీకి గట్టి పోటీ ఇచ్చింది.

నిప్పులాంటి మనిషి – కొండవీటి రాజాChiranjeevi, Balakrishna1986 లో స్టార్ హీరోలు రెండు సార్లు తలపడ్డారు. జనవరి 31 న కొండవీటి రాజా గా చిరు వచ్చి విజయ దుందుభి మోగించగా, వారం తర్వాత ఫిబ్రవరి 7 న నిప్పులాంటి మనిషి గా వచ్చి బాలకృష్ణ పోటీలో వెనుక పడ్డారు.

అపూర్వ సహోదరులు – రాక్షసుడుChiranjeevi, Balakrishna1986 లో పదవ నెలలో మరో సారి యుద్దానికి దిగారు. చిరంజీవి 02 తేదీ రాక్షసుడిగా ముందు వచ్చి కమర్షియల్ హీరో అనిపించుకున్నారు. వారం తర్వాత అపూర్వ సహోదరులు అంటూ వచ్చిన బాలయ్య ఆకట్టుకోలేకపోయారు. రాక్షసుడు మూవీ మెగాస్టార్ కెరీర్ ని మలుపుతిప్పింది.

భార్గవ రాముడు – దొంగ మొగుడుChiranjeevi, Balakrishnaచిరంజీవి హవా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 1987లో సంక్రాంతికి మూడు రోజుల ముందుగానే వచ్చిన దొంగ మొగుడు సూపర్ హిట్ అయింది. జనవరి 14 న బాలకృష్ణ భార్గవ రాముడు మూవీ రిలీజ్ అయి విజయం అందుకోలేకపోయింది.

రాము – పసివాడి ప్రాణంChiranjeevi, Balakrishna1987లో రెండోసారి బాలయ్య, చిరుతో పోటీకి దిగారు. జులై 23 పసివాడి ప్రాణం, 31 రాము చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రెండూ హిట్ సాధించాయి. పసివాడి ప్రాణం మాత్రం చిరు స్థాయిని మరింత పెంచింది.

ఇన్ స్పెక్టర్ ప్రతాప్ – మంచిదొంగChiranjeevi, Balakrishna1988 సంక్రాంతి హీరోగా చిరంజీవి పేరు సంపాదించుకున్నారు. జనవరి 14 న మంచిదొంగ, 15 న ఇన్ స్పెక్టర్ ప్రతాప్ విడుదలయ్యాయి. ఇందులో మంచిదొంగ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.

రాముడు భీముడు – యుద్దభూమిChiranjeevi, Balakrishna1988 మొదట్లో అపజయాన్ని చవిచూసిన బాలయ్య చివర్లో పై చేయి సాధించారు. నవంబర్ 11 వచ్చిన యుద్దభూమి అంచనాలను అందుకోలేక పోయింది. వారం తర్వాత వచ్చిన రాముడు భీముడు హిట్ అందుకుంది.

పెద్దన్నయ్య – హిట్లర్Chiranjeevi, Balakrishnaదాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ వార్ మొదలయింది. 1997 జనవరిలో ఇద్దరి చిత్రాలు తల పడ్డాయి. 4 వ తేదీన హిట్లర్, 10 వ తేదీన పెద్దన్నయ్య రిలీజ్ అయింది. రెండింటిని ప్రజలు ఆదరించారు. హిట్ చేశారు.

వంశోద్ధారకుడు – అన్నయ్యChiranjeevi, Balakrishna2000 వ సంవత్సరం చిరంజీవి వశమైంది. సంక్రాంతిని పురస్కరించుకొని 7 వ తేదీన వచ్చిన అన్నయ్య సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఎన్నో అంచనాలతో 14 వ తేదీన విడుదలయిన వంశోద్ధారకుడు మాత్రం బోల్తా కొట్టింది.

నరసింహ నాయుడు – మృగరాజుChiranjeevi, Balakrishna2001 లో బాలకృష్ణ, చిరుపై ప్రతీకారం తీర్చుకున్నారు. జనవరి 11న చిరు మృగరాజుగా రంగంలోకి దిగగా, బాలయ్య నరసింహ నాయుడిగా తొడగొట్టారు. బాలకృష్ణ చిత్రం సూపర్ హిట్ అయింది. నరసింహ నాయుడు టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది.

భలేవాడివి బాసు – శ్రీ మంజునాథChiranjeevi, Balakrishna2001 లో రెండో సారి ఇద్దరు బరిలోకి దిగారు. జూన్ 15 భలేవాడివి బాసు అంటూ బాలయ్య రాగా, 22 న శ్రీ మంజునాథ అనే భక్తి చిత్రం తో చిరు వచ్చారు. ఈ సారి చిరు కాస్త ఎక్కువ మార్కులతో పాసయ్యారు. బాలకృష్ణ మాత్రం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేక పోయారు.

లక్ష్మీ నరసింహ – అంజిChiranjeevi, Balakrishna2004 లో చిరు, బాలయ్య చివరి సారి పోటీ పడ్డారు. జనవరి 14 న లక్ష్మీ నరసింహ, 15 అంజి రిలీజ్ అయ్యాయి. పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ లక్ష్మీ నరసింహలో అద్భుతంగా నటించి కలక్షన్ల వర్షం కురిపించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన అంజి నిర్మాతకు నష్టాలను మిగిల్చింది.

గౌతమి పుత్ర శాతకర్ణి – ఖైదీ నంబర్ 150Chiranjeevi, Balakrishnaచిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడంతో వీరిద్దరి చిత్రాలు క్లాష్ కాలేదు. మళ్ళీ మదమూడేళ్ల తర్వాత సీనియర్ హీరోల చిత్రాలు పోటీ పడనున్నాయి. 2017 సంక్రాంతికి చిరు ఖైదీ నంబర్ 150 అంటూ వస్తుండగా, బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి గా యుద్ధానికి ఆహ్వానిస్తున్నారు. ఈ సారి గెలుపెవరిదో మరికొన్ని రోజుల్లో తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aatma Balam Movie
  • #Anji Movie
  • #Annayya Movie
  • #Apoorva Sahodarulu Movie
  • #Balakrishna 100th film

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

13 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

15 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

16 hours ago

latest news

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

14 hours ago
ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

15 hours ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

16 hours ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

16 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version