హైదరాబాద్ లో విస్తృతంగా జరుగుతున్న జి.హెచ్.ఎం.సి ఎలక్షన్స్ హడావుడి వల్ల భారతీయ జనతా పార్టీలోకి రోజుకో కొత్త మెంబర్ జాయిన్ అవుతున్నారు. రీసెంట్ గా విజయశాంతి బీజేపీ తీర్ధం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా త్వరలోనే బీజేపీలో జాయిన్ అవుతున్నాడనే వార్తలు హల్ చల్ చేశాయి. పవన్ కళ్యాణ్ తో త్వరలోనే ఓ సినిమా నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకొంటున్న బండ్ల బీజేపీలో జాయిన్ అవ్వడం వెనుక పవన్ కళ్యాణ్ హస్తం కూడా ఉండొచ్చని ఊహాగానాలు సైతం వినిపించాయి.
అయితే.. బండ్ల గణేష్ ఈ కథనాలను ఒకే ఒక్క మాటతో కొట్టిపడేశారు. రాజకీయాలు తనకు పొరపాటున కూడా సూట్ అవ్వవని, కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం వలన తన వ్యక్తిత్వం పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానో చెప్పుకొచ్చి.. ప్రస్తుతం తన బిజినెస్ అయిన కోళ్ల ఫోరమ్ మరియు సినిమాలు తప్ప తనకు మరో యావ లేదని, రాజకీయాలు తన ఒంటికి పడవని, కావున ఈ బీజేపీ ఎంట్రీ అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బండ్ల కుండ బద్దలుకొట్టి మరీ చెప్పేసాడు.
బండ్ల పొలిటికల్ పరంగా క్లారిటీ ఇచ్చాడు బాగానే ఉంది కానీ.. మరి పవన్ తో తీయబోయే సినిమా విషయంలో కూడా క్లారిటీ ఇస్తే బాగుండు. ఇకపోతే.. బండ్ల ఇప్పుడు రియాలిటీ షోలకు గెస్ట్ గా రావడం కూడా మొదలెట్టాడండోయ్. సో, ఆయన స్పీచ్ లు మిస్ అవుతున్నవాళ్ళకి ఇది కొంత ఊరట అన్నమాట.