బండ్ల గణేష్ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఈయన సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు చేసిన క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈయన గత రెండు రోజుల క్రితం టాలీవుడ్ హీరోల గురించి పొగుడుతూ విజయ్ దేవరకొండ పై కౌంటర్ వేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభిమానులు బండ్ల గణేష్ పై పరోక్షంగా విమర్శల వర్షం కురిపించారు. ఇక ఈ వివాదం ముగియకముందే మరోసారి బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా మరొక ట్వీట్ చేశారు.
అయితే ఈ ట్విట్ బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియక నెటిజన్లు తలలు పీకుంటున్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ బానిసత్వానికైనా ఓ హద్దు ఉంటుంది అంటూ ఒక వీడియోని ఒక ఫోటోని షేర్ చేశారు.ఇలా ఈయన బానిసత్వం, హద్దులు అంటూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.ఇక ఈయన ఒక గాడిద ఫోటో షేర్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకీ బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి ఇలా గాడిద ఫోటో షేర్ చేశారు అంటూ అందరూ ఆరాతీస్తున్నారు.
ఇకపోతే కొందరు మాత్రం బండ్ల గణేష్ కచ్చితంగా ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేశారని భావిస్తున్నారు. గత కొంతకాలం నుంచి పవన్ కళ్యాణ్ పట్ల బండ్ల గణేష్ తీవ్ర వ్యతిరేకతను చూపెడుతూ పరోక్షంగా పోస్టులు చేస్తున్నారు.ఈ క్రమంలోనే తన ఇన్ని రోజులు మెగా కుటుంబానికి బానిసగా పని చేశానని ఇకపై చేయబోను అనేలా ఈయన పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి బండ్ల గణేష్ బానిసత్వం అంటూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ ట్వీట్ ఎలాంటి వివాదానికి దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.