పవన్ కళ్యాణ్ పై వర్మ చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బండ్ల గణేష్
- March 26, 2017 / 11:04 AM ISTByFilmy Focus
వర్మ ‘కాటమరాయుడు’ విడుదల సందర్భంగా పవన్ మీద హద్దు మీరి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పవన్ మూడు పెళ్లిల్ల గురించి, కూతుళ్ల గురించి కూడా ప్రస్తావించి వ్యక్తిగత విమర్శలు చేశాడు. దీంతో బండ్ల గణేష్ కూడా వర్మకు అంతే ఘాటుగా రిటార్ట్ ఇచ్చాడు. వర్మను కుక్కతో పోల్చాడు.‘మిస్టర్ రాము, పవన్ కల్యాణ్‌ను విమర్శించే ముందు నీ నోటిని అదుపులో పెట్టుకో. నీకు పవన్‌కల్యాణ్ చెప్పుకున్న విలువ కూడా లేదు’ అని ట్వీట్ చేశాడు.
‘వీధిలో అరిచే కుక్క కంటే నువ్వు ఎక్కువ కాదు. నువ్వు దేశంలో ఓ నల్ల గొర్రెవి. నువ్వు భారతీయుడవని చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. మా ఏరియాలోకి ఎంటర్ అయితే నిన్ను క్షమించం. నువ్వు ఎక్స్‌పైర్ అయిపోయిన టాబ్లెట్‌లాంటివాడివి. నువ్వు పిచ్చి ఆస్పత్రిలో చేరాలని కోరుకుంటున్నాం’ అంటూ వరుసగా రిప్లైలు ఇచ్చాడు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














