మూడునెలలలుగా కరోనా దేశంలో విలయతాండం చేస్తుంది. దాదాపు 80రోజులకు పైగా సాగిన సంపూర్ణ లాక్ డౌన్ వలన కొంత మేర దీనిని నియంత్రించగలిగాం. ఐతే కొద్దిరోజుల క్రితం దేశంతో పాటు అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడం జరిగింది. దాదాపు నార్మల్ గా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనితో కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది ఎక్కువైపోయింది. ఇది చాలా భయపడాల్సిన విషయం అని చెప్పాలి. ఐతే టాలీవుడ్ లో మొదటి కరోనా కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి.
నటుడు మరియు నిర్మాత బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వివిధ మాధ్యమాలలో ప్రచారం జరుగుతుంది. హెయిర్ ప్లాంటేషన్ కొరకు బండ్ల గణేష్ ఓ క్లినిక్ కి వెళ్లగా, వారు మొదట కరోనా టెస్ట్ చేయాలని చెప్పారట. బండ్ల గణేష్ కి కరోనా టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని సమాచారం. దీనితో ఆయన కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు కరోనా టెస్ట్స్ చేయించుకుంటున్నారట. ఐతే ఈ వార్తను బండ్ల గణేష్ ఖండించినట్లు తెలుస్తుంది.
నాకు కరోనా టెస్ట్ జరగలేదు, ఆ వైరస్ నాకు సోకలేదని ఆయన చెవుతున్నట్లు సమాచారం. దీనిపై స్పష్టత రావడానికి కొంచెం సమయం పట్టేలా ఉంది. ఇక బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే టాలీవుడ్ లో ఆ వ్యాధిబారిన పడిన మొదటి వ్యక్తి అవుతారు. టాలీవుడ్ ప్రముఖులు దీని బారిన పడకుండా చాల జాగ్రత్తగా ఉంటున్నారు.