బండ్ల గణేష్ నటుడిగా వచ్చి నిర్మాతగా ఎదిగారు. తన పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ లతో సినిమాలు చేశారు. ఆయన నిర్మించిన చివరికి మూవీ టెంపర్. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ సినిమా చేయలేదు. తన ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఆయన మళ్ళీ సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నారు. అంటే నిర్మాతగా రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. తన బ్యానర్లో తొలిసారి రవితేజ తో మూవీ చేశారు. మళ్ళీ ఇప్పుడు అతనితోనే రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకే అతని డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రవితేజ చాలా బిజీగా ఉన్నారు.
అతను నటించిన “రాజా ది గ్రేట్” రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. దీని తర్వాత విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ”టచ్ చేసి చూడు” సినిమాను పూర్తి చేయనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత శ్రీనువైట్లతో మూవీ మొదలుకానుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. సో వచ్చే ఏడాది చివరి వరకు రవితేజ డేట్స్ ఖాళీ లేవు. ఆ తర్వాత బండ్ల గణేష్ కి డేట్స్ ఇవ్వొచ్చని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.