Bangarraju Movie: ఆ సినిమాను నాగ్ ఫాలో అవుతున్నారా?

  • December 14, 2021 / 08:27 AM IST

నాగార్జున సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో సోగ్గాడే చిన్నినాయన సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. 2016 సంవత్సరంలో తక్కువ థియేటర్లలో విడుదలైనప్పటికీ ఈ సినిమా 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాతో పాటు డిక్టేటర్, నాన్నకు ప్రేమతో సినిమాలు విడుదల కాగా డిక్టేటర్ బిలో యావరేజ్ గా నిలిస్తే నాన్నకు ప్రేమతో సినిమా హిట్ గా నిలవడం గమనార్హం. సోగ్గాడే చిన్నినాయన సినిమాలోని బంగార్రాజు పాత్ర నాగార్జునకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ సినిమా నిడివిని మేకర్స్ లాక్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా నిడివి 2 గంటల 15 నిమిషాలుగా ఉండనుందని తెలుస్తోంది. సోగ్గాడే చిన్నినాయన రన్ టైమ్ 2 గంటల 25 నిమిషాలు కాగా ఆ సినిమా కంటే ఈ సినిమా నిడివి మరింత తక్కువ కావడం గమనార్హం.

క్రిప్సీ రన్ టైమ్ బంగార్రాజుకు ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రన్ టైమ్ విషయంలో నాగ్ సోగ్గాడే చిన్నినాయన సినిమాను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా చైతన్యకు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. ట్రైలర్ రిలీజైతే మాత్రమే ఈ సినిమా కథాకథనాల గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ మధ్య కాలంలో నాగార్జున నటించి థియేటర్లలో రిలీజవుతున్న సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరుస్తున్నాయి. భారీ బడ్జెట్ తో నాగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. వరుస విజయాలలో ఉన్న నాగచైతన్య వల్ల ఈ సినిమాకు బిజినెస్ బాగానే జరుగుతోంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు, నాగార్జునకు ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకమని చెప్పవచ్చు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus