Varun, Lavanya: ఇటలీలో పెళ్లి చేసుకున్న స్టార్ సెలబ్రిటీస్ వీళ్లే!

Advertisement

నటి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నేడు ఇటలీలో మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు వీరిద్దరూ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే వీరి వివాహం ఇటలీలో ఎంతో ఘనంగా జరగబోతుంది మరి కాసేపట్లో ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇలా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇటలీలో చేసుకుంటున్నారు అయితే వీరి కంటే ముందుగానే ఇటలీలో పెళ్లి చేసుకున్నటువంటి సెలబ్రిటీలు కూడా ఉన్నారు మరి ఆ జంటలు ఎవరు అనే విషయానికి వస్తే..

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కంటే ముందుగానే ఇటలీలో పెళ్లి చేసుకున్నటువంటి వారిలో ప్రముఖ బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ, ఆదిత్య చోప్రా వివాహం ఇటలీలోనే జరిగింది వీరి వివాహం 2014, ఏప్రిల్ 21వ తేదీ మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. అదేవిధంగా బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఇటలీలోనే వివాహం చేసుకున్నారు. ఇద్దరు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ ఇటలీలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

వీరి వివాహం 2017 డిసెంబర్ 11వ తేదీ ఇటలీలోని టుస్కానీ నగరంలోనే జరిగింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. హేట్ స్టోరీ 2’ నటి, బాలీవుడ్ బ్యూటీ సుర్వీన్ చావ్లా బిజినెస్ మ్యాన్ అక్షయ్ ఠాకూర్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. 2015లో ఇటలీలో వీరి వివాహం జరిగింది. వీరితోపాటు ప్రపంచ కుబేరుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం ఇండియాలో జరిగిన మాత్రం ఇటలీలో జరిగింది.

ఇలా ఈ సెలబ్రిటీలందరూ (Varun) వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కంటే ముందుగానే ఇటలీలో వివాహం చేసుకున్నారు. ఇక ఈరోజు లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ వివాహం బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్, ఇటలీలో గ్రాండ్ గా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, నితిన్, మెగా కుటుంబీకులు ఈ పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేస్తున్నారు మరికొన్ని గంటలలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus