బెల్లంకొండ గణేష్ సినిమా అప్డేట్ ఏంటి…!

  • February 29, 2020 / 04:40 PM IST

బెల్లంకొండ సురేష్ తన ఇద్దరి కొడుకులని హీరోలుగా నిలబెట్టడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే పెద్ద కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ .. హీరోగా నిలదొక్కుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక చిన్న కొడుకుని కూడా లాంచ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. అయితే పెద్ద కొడుకు లాంచింగ్ కు చేసినట్టు భారీ హడావిడి చేయడం లేదు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ‘సావిత్రి’ వంటి చిత్రాల్ని తెరకెక్కించిన దర్శకుడు పవన్ సాథినేనితో బెల్లంకొండ గణేష్ ను హీరోగా లాంచ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఇక తాజాగా రెండో షెడ్యూల్ కూడా మొదలైంది. ఈ షెడ్యూల్ లో హీరో గణేష్ పై కొన్ని కామెడీ సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సీన్స్ సినిమాలో చాలా బాగా అలరిస్తాయట. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ‘లక్ష్మి’ ‘లక్ష్యం’ ‘రేసు గుర్రం’ వంటి సూపర్ హిట్ చిత్రాల్ని నిర్మించిన నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా … ‘అందాల రాక్షసి’ ‘అర్జున్ రెడ్డి’ ‘హుషారు’ వంటి చిత్రాలకు సంగీతం అందించిన రధన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అంది స్తుండడం విశేషం.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus