యాక్షన్ సినిమాల్లో కొంచెం ఓవరాక్షన్ ఉండటం కామన్. అభిమానుల్లో ఊపు తెప్పించడానికి మన హీరోలు ఒక్కోసారి అలాంటి సీన్లు చేస్తుంటారు. వాటిని చూసి అభిమానులు ఆనందిస్తే, నెటిజన్లు విమర్శలు చేస్తుంటారు. అది కామన్. కానీ ఆ ‘అతి’ని బుల్లితెర మీద కూడా చేస్తే… దానిని వీర అతి అంటారు. ఇప్పుడు ఆ బృహత్ కార్యక్రమం చేశాడు మన బెల్లం బాబు. అదేనండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సంక్రాంతి సందర్భంగా ఓ ఛానల్లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌కి బెల్లం కొండ సాయిశ్రీనివాస్ వచ్చాడు.
అందులో సరదాగా తాడు లాగుడు పందెం పెట్టారు. అందులో ఏడుగురు భారీ కాయులు ఒకవైపు, బెల్లంకొండ శ్రీను ఒకవైపు. అదీ ఫ్రేమ్. ఆ ఏడుగురు తాడు లాగుతుంటే… మన బాబుగారు తాడు మీద కాలు వేసి ఆపేశారట. దానికి చుట్టూ ఉన్నవాళ్లు చప్పట్లు కొట్టడం. 75 సెకన్లన ప్రోమోలో ఇదే హైలైట్. మరి రెండు గంటల షోలో ఇంకెన్ని ఇలాంటివి ఉంటాయో.
బాలీవుడ్ వెళ్లి అక్కడ పాగా వేద్దాం అనుకుంటున్న తరుణంలో ఇలాంటి ‘ఓవర్ రియలిస్టిక్’ సీన్స్ చేసి అభిమానుల ముందు పెడితే బాగుండదేమో బెల్లంకొండ సర్.. కాస్త ఆలోచించుకోండి అంటూ నెటిజన్ల సలహాలు ఇస్తున్నారు.