‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ వంటి సూపర్ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari)అనే మాస్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేశారు. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది..లు ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీత దర్శకుడు.
2023 అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఈ అక్టోబర్ 19కి భగవంత్ కేసరి రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తికావస్తోంది. బాలకృష్ణ కెరీర్లో ఇదొక రెస్పెక్టబుల్ మూవీ అని చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా . 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డుని సైతం అందుకుంది. ఈ సందర్భంగా ఒకసారి టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 19.75 కోట్లు |
| సీడెడ్ | 13 కోట్లు |
| ఉత్తరాంధ్ర | 6.5 కోట్లు |
| ఈస్ట్ | 3.60 కోట్లు |
| వెస్ట్ | 2.95 కోట్లు |
| కృష్ణా | 2.70 కోట్లు |
| గుంటూరు | 5.56 కోట్లు |
| నెల్లూరు | 2.80 కోట్లు |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 56.86 కోట్లు |
| రెస్ట్ ఆఫ్ ఇండియా+ హిందీ | 5.80 కోట్లు |
| ఓవర్సీస్ | 7.35 కోట్లు |
| వరల్డ్ వైడ్ టోటల్ | 70.01 కోట్లు(షేర్) |
‘భగవంత్ కేసరి’ సినిమా రూ.61 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ఏకంగా రూ.70.01 కోట్ల షేర్ ను రాబట్టి… రూ.9.01 కోట్ల ప్రాఫిట్స్ తో సూపర్ హిట్ గా నిలిచింది.