Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » హత్య కాదు వధ అన్నది “గాడ్సే”వాదుల వాదన : “1948 – అఖండ భారత్” ప్రి రిలీజ్ ఫంక్షన్ లో జై భజరంగ్ దళ్ నాయకులు

హత్య కాదు వధ అన్నది “గాడ్సే”వాదుల వాదన : “1948 – అఖండ భారత్” ప్రి రిలీజ్ ఫంక్షన్ లో జై భజరంగ్ దళ్ నాయకులు

  • August 11, 2022 / 04:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హత్య కాదు వధ అన్నది “గాడ్సే”వాదుల వాదన : “1948 – అఖండ భారత్” ప్రి రిలీజ్ ఫంక్షన్ లో  జై భజరంగ్ దళ్ నాయకులు

ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎం.వై.మహర్షి నిర్మించిన చిత్రం ”1948-అఖండ భారత్ ”. అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో రేపు (12న) విడుదలవుతోంది. ఈ చిత్రంలో గాంధీగా రఘనందన్, నాథురాం గోడ్సే గా డా. ఆర్యవర్ధన్ రాజ్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రుగా ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ ప్రధాన పాత్రలు పోషించారు!!

ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రి రిలీజ్ ఈవెంట్ లో చిత్ర నిర్మాత ఎమ్.వై.మహర్షి, దర్శకుడు ఈశ్వర్ డి.బాబు, రచయిత మరియు గాడ్సే పాత్రధారి డా. ఆర్యవర్ధన్ రాజు, గాంధీ పాత్రధారి రఘునందన్, నెహ్రూ పాత్రధారి ఇంతియాజ్, సంగీత దర్శకుడు ప్రజ్వల్ క్రిష్, ఎడిటర్ రాజు జాదవ్, నటుడు సుహాస్ తో పాటు యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాత ఆచంట గోపీనాథ్ లతోపాటు విశ్వహిందూ పరిషత్ మరియు జై భజరంగ్ దల్ నాయకులు శ్రీనివాస్ రాజ్, శివరాములు, మహేష్ యాదవ్ ముఖ్య అతిధులుగా విచ్చేసి… “1948 – అఖండ భారత్” మన తెలుగువారంతా గర్వపడే చిత్రంగా పేర్కొన్నారు. గాంధీని గాడ్సే చేసింది హత్య కాదని, దేశ విశాల ప్రయోజనాల కోసం చేసిన వధగా భావించేవారు ఇప్పటికీ ఉన్నారని అన్నారు. గాడ్సే కోణం వెలుగులోకి రాకుండా దాచిపెట్టిన ఎన్నో విషయాలను “1948 – అఖండ భారత్”లో నిష్పక్షపాతంగా చూపించారని వివరించారు.

డాక్టర్ ఆర్యవర్థన్ రాజు మాట్లాడుతూ… “గాంధీజీని ఎవరు చంపారన్నది అందరికి తెలుసు. కానీ ఎందుకు.. ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియవు. దానిక్కారణం… గాడ్సే తన కోర్టు వాదనలో గాంధీజీని వధించడానికి గల కారణాలను సుమారు 150 పాయింట్స్ గా.. 8 గంటలపాటు సుదీర్ఘంగా వివరించినా… అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కోర్ట్ నుంచి బైటికి రానివ్వకుండా నిషేధించింది. గాడ్సేని ఉరి తీసిన సుమారు 30 సంవత్సరాల తర్వాత… ఆయన కోర్ట్ లో ఇచ్చిన వాగ్మూలం బయటకు వచ్చినా- దాన్ని కూడా ప్రచురణ కాకుండా అడ్డుకున్నారు.

అలా 70 సంవత్సరాల పాటు దాచి పెట్టబడిన నిజాలను… ప్రామాణికంగా పరిశోధన చేసి ఈ సినిమాకి స్క్రిప్ట్ ని సిద్ధం చేశాం… మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి… హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని, వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాం’ అన్నారు.

చిత్ర దర్శకుడు ఈశ్వర్ డి.బాబు మాట్లాడుతూ…11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి… 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 700కి పైగా ప్రొపర్టీస్, 500కి పైగా కాస్ట్యూమ్స్,  500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్ లో, 9 షెడ్యూల్స్ లో… ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం” అన్నారు!!

ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించినందుకు గర్వంగా ఉందని… దర్శకుడు ఈశ్వర్, ఆర్యవర్ధన్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేశారని, హైదరాబాద్ లో ఉన్న సెన్సార్ బోర్డ్… ఈ సినిమా సెన్సార్ చేయడానికి నిరాకరిస్తే… ముంబైలో చేయించామని నిర్మాత ఎమ్.వై. మహర్షి పేర్కొన్నారు. “1948 – అఖండ భారత్” వంటి ప్రతిష్టాత్మక చిత్రానికి పనిచేసే అవకాశం రావడం పట్ల సంగీత దర్శకుడు ప్రజ్వల క్రిష్, ఎడిటర్ రాజు జాదవ్, నటుడు సుహాస్ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #1948 akhanda bharath
  • #Akhanda

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version