యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) నుండి ఈ ఏడాది మూడు సినిమాలు వచ్చాయి. అందులో ‘పురుషోత్తముడు’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా డిజాస్టర్ అయ్యింది. ‘తిరగబడరసామి’ (Tiragabadara Saami) అయితే వాషౌట్ అయిపోయి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక మూడో సినిమా ‘ ‘భలే ఉన్నాడే’ కి (Bhale Unnade) కూడా పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. దర్శకుడు మారుతి (Maruthi Dasari) టీం నుండి వచ్చిన సినిమా కావడంతో మొదట దీనిపై కొద్దిపాటి అంచనాలు ఉన్నాయి.
‘గీతా సుబ్రమణ్యం’, ‘పెళ్లిగోల 2’ వంటి వెబ్ సిరీస్…లు తెరకెక్కించిన శివ సాయి వర్ధన్ (J Sivasai Vardhan) డైరెక్ట్ చేసిన సినిమా ఇది. టీజర్, ట్రైలర్స్..ఆకట్టుకున్నాయి. సినిమాలో కామెడీ కూడా కొంతవరకు వర్కౌట్ అయ్యింది. కానీ థియేటర్లలో ఈ సినిమా నిలబడలేదు. ఒకసారి (Bhale Unnade) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.28 cr |
సీడెడ్ | 0.07 cr |
ఉత్తరాంధ్ర | 0.15 cr |
ఈస్ట్+వెస్ట్ | 0.06 cr |
కృష్ణా+గుంటూరు | 0.09 cr |
నెల్లూరు | 0.05 cr |
ఏపి+తెలంగాణ | 0.70 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 0.10 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 0.80 cr |
‘భలే ఉన్నాడు’ చిత్రానికి రూ.1.53 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్లో ఈ సినిమా కేవలం రూ.0.89 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.0.91 కోట్ల దూరంలో ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలింది అని చెప్పాలి.