Allu Arjun: అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్.. ఏమైందంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) .. ఏపీ ఎన్నికల టైంలో నంద్యాల వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవి తరఫున ప్రచారం చేసి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. అంటే ఎలెక్షన్స్ కి 48 గంటల ముందు నుండి ఎటువంటి ప్రచారం చేయకూడదు. అయినా సరే అల్లు అర్జున్ ఎన్నికలకు ముందు రోజు నంద్యాల వెళ్లి.. ఎటువంటి పర్మిషన్ కూడా తీసుకోకుండా తన స్నేహితుడు శిల్పా రవికి ప్రచారం చేశాడు. ఈ కారణాలతో అతనిపై కేసు నమోదైంది.

Allu Arjun

మరి దాని సంగతి ఏమైందో తెలీదు కానీ.. దాని వల్ల మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడు అల్లు అర్జున్ అని అంతా అంటుంటారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై మెగా అభిమానులు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఏకమై వారికి కౌంటర్లు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వారిని అల్లు అర్జున్ … ‘అల్లు అర్జున్ ఆర్మీ’ గా సంబోధిస్తూ ఉంటాడు. ఇప్పుడు అదే అతన్ని చిక్కుల్లో పడేసింది. విషయం ఏంటంటే..

అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని హైదరాబాద్ లో ఉన్న జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్ కంప్లైంట్ చేశారు. ‘తన అభిమాన సంఘాన్ని ‘అల్లు అర్జున్ ఆర్మీ’ గా ప్రస్తావించడం చాలా తప్పు, ఆర్మీ అనే పదానికి చాలా గౌరవం ఉంది. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో నిద్రాహారాలు మానుకుని పోరాడే సైనికులను ఆర్మీ అంటారు. తన స్వార్థం కోసం అభిమానులని ఆర్మీగా అల్లు అర్జున్ ప్రమోట్ చేయడం సరైన పద్దతి కాదు’ అంటూ శ్రీనివాస్ గౌడ్ కంప్లైంట్లో పేర్కొన్నట్టు తెలుస్తుంది.

దీని గురించి అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇటీవల ‘పుష్ప 2’ ప్రమోషన్స్ లో భాగంగా కొచ్చి, చెన్నై, పాట్నా .. వంటి ఊర్లల్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లలో కూడా అల్లు అర్జున్… ‘ ‘నా ఫ్యాన్స్.. నా ఆర్మీ.. వాళ్లంటే నాకు పిచ్చి’ అంటూ కేవలం తనకు మాత్రమే ఫ్యాన్స్ ఉన్నట్టు అతిగా మాట్లాడుతున్నాడు’ అని చాలా భావిస్తున్న నేపథ్యంలో ఇలా అల్లు అర్జున్ పై కంప్లైంట్ ఫైల్ అవ్వడం అనేది పెద్ద విచిత్రమైన సంగతి కాదు అనే చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus