సమంత (Samantha) తండ్రి జోసెఫ్ ప్రభు నిన్న అంటే నవంబర్ 29 న మృతి చెందారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకి గుండెపోటు రావడంతో నిన్న కన్ను ముసారు. ఆయన్ని ఎప్పటికీ మిస్ అవుతాను అంటూ సమంత పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ అందరి హృదయాల్ని కదిలించింది. ‘స్టే స్ట్రాంగ్’ అంటూ ఆమె అభిమానులు కామెంట్ లు చేశారు. ఇక కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన తండ్రి గురించి మాట్లాడుతూ.. ” మా నాన్న గారు కూడా ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు మాదిరె.
‘నువ్వు అంత తెలివైనదానివి కాదు. అలా అని తెలివితక్కువ దానివి కూడా కాదు. తలుచుకొంటే నువ్వు కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించగలవు. తలుచుకోవడం ముఖ్యం’ అంటూ చదువుకునే రోజుల్లో చేప్పేవారు. నా జీవితంపై ఆయన మాటల ప్రభావం ఎక్కువగానే ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల సమంత సిటాడెల్ హన్నీ బెన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె మదర్ రోల్ లో చాలా ఎమోషనల్ గా నటించడం విశేషం.
మరోపక్క సమంత తండ్రి పోయి బాధలో ఉంటే మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) , అలాగే మాజీ మామ నాగార్జున(Nagarjuna) , అఖిల్ (Akhil Akkineni) .. లు స్పందించకపోవడం పై కొంతమంది మండిపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే డిసెంబరు 4న నాగ చైతన్య- శోభిత (Sobhita Dhulipala).. ల పెళ్లి ఉంది. ఈ టైమ్లో పలకరింపులు వంటివి చేయకూడదు అనే ఆచారం ఉంది. అందుకే వాళ్లు స్పందించలేదు అని స్పష్టమవుతోంది