పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటెర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి సంభాషణలు,స్క్రీన్ ప్లే ను అందించడంతో పాటు కథలో మార్పులు చేయడం కూడా జరిగింది.ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఆంధ్రలో ఈ చిత్రానికి ప్రభుత్వం నుండీ ఎన్నో అవంతరాలు ఎదురైనప్పటికీ రికార్డు కలెక్షన్లను రాబడుతుంది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 23.00 cr |
సీడెడ్ | 7.20 cr |
ఉత్తరాంధ్ర | 4.50 cr |
ఈస్ట్ | 3.55 cr |
వెస్ట్ | 3.91 cr |
గుంటూరు | 3.87 cr |
కృష్ణా | 2.31 cr |
నెల్లూరు | 1.78 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 50.12 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 6.25 cr |
ఓవర్సీస్ | 9.85 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 66.22 cr |
‘భీమ్లా నాయక్’ చిత్రానికి రూ.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.110 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫస్ట్ వీకెండ్ ఈ చిత్రం రూ.66.22 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.43.78 కోట్ల షేర్ ను రాబట్టాలి. మూడో రోజు కూడా భారీగా కలెక్ట్ చేసింది.కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవ్వాలి అంటే ఈ వారం మొత్తం ఇదే విధంగా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!