Bheemla Nayak Trailer Date: భీమ్లా నుంచి టీజర్, ట్రైలర్ రిలీజయ్యేది అప్పుడేనా?

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ డేట్లు ఫిక్స్ అయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన భీమ్లా నాయక్ గ్లింప్స్, రానా టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే ఈ సినిమా నుంచి మరో పవర్ ఫుల్ టీజర్, ట్రైలర్ త్వరలో రిలీజ్ కానున్నాయని సమాచారం. డిసెంబర్ 14వ తేదీ రానా పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.

రానా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి హై వోల్టేజ్ టీజర్ రిలీజ్ కానుందని బోగట్టా. భీమ్లా నాయక్ మేకర్స్ ఇప్పటికే ఈ మేరకు ప్రణాళికలను సిద్ధం చేశారని సమాచారం. జనవరి 1వ తేదీన లేదా 5వ తేదీన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ సినిమాలో పవన్ భీమ్లా నాయక్ పాత్రలో నటిస్తుండగా రానా డేనియల్ శేఖర్ గా కనిపించనున్నారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ కథను తెలుగు నేటివిటీకి తగిన విధంగా త్రివిక్రమ్, సాగర్.కె.చంద్ర మార్పులు చేశారు.

పవన్, రానా కలిసి నటిస్తున్న తొలి సినిమా భీమ్లా నాయక్ అనే సంగతి తెలిసిందే. మరోవైపు ఆర్ఆర్ఆర్ నిర్మాత‌లు భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతి రేసు నుంచి తప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. భీమ్లా నాయక్ మేకర్స్ మాత్రం సినిమా రిలీజ్ డేట్ విషయంలో మార్పు ఉండదని స్పష్టం చేస్తున్నారు. భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ విషయంలో పూర్తిస్థాయిలో స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus