‘బూతు డైరెక్టర్’ అని పేరున్న మారుతీ మొదట్లో యూత్ కి నచ్చే సినిమాలని మాత్రమే తెరకెక్కిస్తూ వచ్చాడు. తరువాత దాని నుండీ బయట పాడటానికి ‘జబ్బు’ సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. ‘భలే భలే మగాడివోయ్’ ‘బాబు బంగారం’ ‘మహానుభావుడు’ ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఇలా వరుసగా అదే తరహా సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం కూడా సో సో గానే ఆడింది. దీంతో ఇప్పుడు మారుతీకి అర్జెంట్ గా ఓ హిట్టు కావాలి. అందుకే ఓ మెగా హీరోతో సినిమా ఓకే చేయించుకున్నాడు.
ఆ మెగా హీరో మరెవరో కాదు సాయి తేజ్. 6 ప్లాపుల తరువాత తేజు ‘చిత్రలహరి’ చిత్రంతో హిట్టందుకున్నాడు. భారీ హిట్టు కాకపోయినా… ఈ చిత్రం తేజు కి మంచి రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో ఎంటర్టైన్మెంట్ కి ‘కేర్ అఫ్ అడ్రెస్స్’ అయిన మారుతీ డైరెక్షన్లో ఓ బ్లాక్ బస్టర్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రానికి ‘భోగి’ అనే టైటిల్ ను అనుకుంటున్నారట. కాస్త వెటకారంగా ఉన్నప్పటికీ.. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి.. ఈ టైటిల్ అయితేనే క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారట. ‘గీతా ఆర్ట్స్’ మరియు ‘యూ.వి.క్రియేషన్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.