మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ‘భోళా శంకర్’ మూవీ ఆగస్టు 11న రిలీజ్ కాబోతోంది. ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా..కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రని పోషించింది. మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు. యంగ్ హీరో సుశాంత్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. సినిమా పై బజ్ అయితే పెద్దగా ఏర్పడలేదు.
ట్రైలర్ అలాగే రెండు పాటలు జస్ట్ ఓకే అనిపించాయి.మెహర్ రమేష్ తీసిన గత సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో .. థియేట్రికల్ బిజినెస్ ఓ మోస్తరుగా మాత్రమే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 21.70 cr |
సీడెడ్ | 11.90 cr |
ఉత్తరాంధ్ర | 9.30 cr |
ఈస్ట్ | 6.20 cr |
వెస్ట్ | 4.40 cr |
గుంటూరు | 5.82 cr |
కృష్ణా | 4.45 cr |
నెల్లూరు | 2.75 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 66.52 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.80 cr |
ఓవర్సీస్ | 7.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 78.32 cr (షేర్) |
‘భోళా శంకర్’ (Bhola Shankar) చిత్రానికి రూ.78.32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.79 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమా పై బజ్ అయితే లేదు. కాబట్టి.. టార్గెట్ రీచ్ అవ్వాలంటే పాజిటివ్ టాక్ రావాలి. లేదంటే కష్టమే..!
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!