Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

శ్రీ విష్ణు మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇతని నటన, ఎంపిక చేసుకునే కథలు, కామిడీ టైమింగ్ కి సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ట్రేడ్లో కూడా శ్రీ విష్ణు ప్రత్యేకం.

Mrithyunjay Collections

అతనితో సినిమాలు చేస్తే ఎంతో కొంత వెనకేసుకోవచ్చు అనే నమ్మకం కూడా ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్యనే వారం రిలీజ్ అయిన ‘విష్ణు విన్యాసం’ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఆ సినిమాకి మొదటి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ శ్రీ విష్ణు మార్క్ కామిడీని ఇష్టపడే వారు పాజిటివ్ రెస్పాన్స్ చెప్పారు. అందువల్ల బాక్సాఫీస్ వద్ద నిలబడి ఎంతో కొంత ఓపెనింగ్స్ ని అయితే తీసుకుంది. ఇప్పుడు అతను హీరోగా రూపొందిన మరో సినిమా ‘మృత్యుంజయ్'(Mrithyunjay) కూడా మార్చి 6న రిలీజ్ అయ్యింది.

మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. కానీ ఫస్ట్ డే అనుకున్న స్థాయిలో వసూళ్ళు రాలేదు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.58 cr
సీడెడ్ 0.11 cr
ఆంధ్ర(టోటల్) 0.32 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.01 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.15 cr
ఓవర్సీస్ 0.20 cr
వరల్డ్ వైడ్(టోటల్) 1.36 cr(షేర్)

‘మృత్యుంజయ్’ సినిమాకి రూ.6 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.6.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1.36 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.5.14 కోట్ల షేర్ ను రాబట్టాలి.పాజిటివ్ టాక్ రావడం వల్ల 2వ రోజు కొంచెం బెటర్ అనిపించింది.

నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus