సోదరిగా భూమిక..!!

  • August 13, 2016 / 12:23 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీ చిత్రంలో భూమిక హీరోయిన్ గా నటించి యువకుల హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత ఒక్కడు, సింహాద్రి సినిమాలతో సూపర్ హిట్ లను అందుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ, భోజ్ పురి భాషా చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. తన మాతృభాష పంజాబీ లోను ఓ సినిమా చేసింది.

పెళ్లి అయినా తర్వాత సినిమాలకు దూరమైనా ఈ భామ క్యారక్టర్ రోల్స్ చేయడానికి సిద్ధమంటోంది. యువనటుడు సుశాంత్ రాజ్ పుత్ నటించిన “ఎమ్మెస్ ధోనీ’ హిందీ సినిమా ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇచ్చింది. హీరో పాత్రకు సోదరిగా భూమిక నటించింది. రెండు రోజుల క్రితం రిలీజైన చిత్ర ట్రైలర్ లో ఆమె తళుక్కుమంది.

ఈ పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకొస్తుందని బాలీవుడ్ వర్గాల వారు భావిస్తున్నారు. గ్లామర్ పాత్రలో భూమికను చూసిన వారికి ఇది కొంత ఇబ్బంది కలిగించే వార్త అయినా తిరిగి ఆమె తెరపై కనిపిస్తున్నందుకు అభిమానులు ఆనందపడుతున్నారు. “ఎమ్మెస్ ధోనీ” హిట్ అయితే భూమికను మళ్లీ తెలుగు చిత్రాల్లోనూ కూడా చూసే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus