విజయ్ ఆంథోని ని హీరోగా నిలబెట్టిన చిత్రం ‘పిచ్చైకారన్’. ఇది తెలుగులో బిచ్చగాడుగా వచ్చి తమిళంలో కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ఇందులో విజయ్ ఆంథోని కి జోడీగా సాద్నా టైటస్ నటించింది. అందం, అభినయంతో తెలుగు, తమిళంలో అభిమానులను ఏర్పరుచుకుంది. ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. భారీ ఆఫర్లు ఆమె ముందు వాలాయి. ఆమె మాత్రం కుటుంబ నిర్ణయానికి ప్రాముఖ్యత ఇచ్చింది. నటనను వదిలిపెట్టి పెళ్లి పీటలు ఎక్కింది. సినీ డిస్ట్రిబ్యూటర్ కార్తీక్ను పెళ్లి చేసుకొని అభిమానులకు షాకిచ్చింది. ఆ తర్వాత ఆమె మీడియా ముందుకు రాలేదు. మీడియాలో కనిపించలేదు.
ఇంటికే పరిమితమయింది. తాజాగా తల్లి అయినట్లు తెలిసింది. సాద్నా ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు సమాచారం. అయితే ఈ విషయం కూడా ఆలస్యంగా బయటకి వచ్చింది. త్వరలోనే బిడ్డకి పేరు పెట్టే వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నారని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఆ వేడుకని కూడా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో జరపడానికి అనుకుంటున్నారు. మీడియాని ఆహ్వానించడం లేదని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకోవడానికి సాద్నా ఆసక్తి కనబరచడం లేదని తెలిసింది.