‘సైతాన్’ గా రాబోతున్న బిచ్చగాడు ‘విజయ్ ఆంటోని’

‘విజయ్ ఆంటోని’ ఇంకా చెప్పాలంటే ‘బిచ్చగాడు’ ఇప్పుడీ పేరు సినీ ప్రియులకు మరింత ప్రియం అవుతోంది. మొన్న ‘డా:సలీం’ గా పలకరించి, నిన్న ‘బిచ్చగాడు’ గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అలరించిన హీరో ‘విజయ్ ఆంటోని’. ఆయన నటించిన ‘బిచ్చగాడు’ ఘన విజయం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో ‘విజయ్ ఆంటోని’ కధానాయకునిగా తమిళంలో రూపొందుతున్న ‘సైతాన్’ చిత్రం పై అటు తమిళనాట,ఇటు తెలుగునాట సినీ, ప్రేక్షక వర్గాలలో ఆసక్తి మరింత పెరుగుతుంటే, మరోవైపు ‘సైతాన్’ తెలుగు నాట విడుదల హక్కులకై పోటీ వేగం కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ఈ దశలో..

‘సైతాన్’ చిత్రం తెలుగు నాట ప్రదర్శన హక్కులను ‘విన్.విన్.విన్. క్రియేషన్స్’ సంస్థ నిర్మాత ఎస్.వేణుగోపాల్ చేజిక్కించుకున్నారు.(‘క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ ‘సందీప్ కిషన్, రెజీనా’ జంటగా రూపొందిస్తున్న’నక్షత్రం’ చిత్ర నిర్మాతలలో ఈయన ఒకరు) .

‘విజయ్ ఆంటోని’ గారి ‘సైతాన్’ చిత్రం తెలుగు నాట ప్రదర్శన హక్కులు తమ సంస్థ ‘విన్.విన్.విన్. క్రియేషన్స్ చేజిక్కించుకోవటం పట్ల ఎంతో సంతోషాన్నివ్యక్తం చేశారు నిర్మాత ఎస్.వేణుగోపాల్. ఆయన మాట్లాడుతూ..’బిచ్చగాడు’ చిత్రం విడుదలకు సిద్ధమైన దశలోనే ‘సైతాన్’ చిత్రం హక్కులను తీసుకునే ప్రయత్నం చేసాం. మా ఈ ప్రయత్నానికి ఎంతో సహకరించిన కృష్ణవంశీ గారికి, విజయ్ ఆంటోనీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ‘సైతాన్’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. జులై నెలలో చిత్రం ఆడియో విడుదల వైభవంగా జరుపనున్నాము. ఆగస్టు నెలలో తెలుగు,తమిళంలో చిత్రం ఒకే మారు విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిపారు.

‘సైతాన్’: ‘సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్’
చిత్ర కథానాయకుడు ‘విజయ్ ఆంటోని’ మాట్లాడుతూ..’ నటునిగా వైవిధ్యమైన పాత్రల పోషణ లక్ష్యం గా ఉన్న నాకు కొనసాగింపు ఈ ‘సైతాన్’. ‘సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్’ ఈ చిత్రం. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఈ చిత్రంలో నా పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నమైనదిగా ఉండటంతో పాటు, వైవిధ్యాన్ని సంతరించుకుని ఉంటుంది. నా సరసన ‘అరుంధతి నాయర్’ నాయికగా నటిస్తున్నారు. చిత్ర దర్శకుడు ‘ప్రదీప్ కుమార్’ ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించేలా తీర్చిదిద్దుతున్నారని నమ్ముతున్నాను. ‘ప్రదీప్ కలపురయల్’ సినిమాటోగ్రఫీ ఓ ఎస్సెట్ ఈ చిత్రానికి. ‘సైతాన్’ కు సంగీతం నేనే. పాటలు,నేపధ్య సంగీతం ప్రేక్షకులను అలరిస్తాయని ఆశిస్తున్నాను. ‘బిచ్చగాడు’ విజయం తరువాత విడుదల అవుతున్న ‘సైతాన్’ చిత్రం పై సహజంగా అంచనాలు అధికంగానే ఉంటాయి. వాటికి తగిన స్థాయిలోనే ఈ చిత్రం ఉంటుందని తెలిపారు చిత్ర కథానాయకుడు ‘విజయ్ ఆంటోని’. తెలుగునాట నటునిగా తనకు ఈ చిత్రం మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

‘విజయ్ ఆంటోని,,అరుంధతినాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, సినిమాటోగ్రఫీ: ప్రదీప్ కలిపురయత్,ఎడిటర్; వీర సెంథిల్, ఫైట్స్: శరవణన్, ఆర్ట్: శక్తి వెంకట్ రాజ్.
నిర్మాత: ఎస్.వేణుగోపాల్,
సమర్పణ: ఎం.శివకుమార్
దర్శకత్వం: ప్రదీప్ కుమార్
బ్యానర్: విన్.విన్.విన్. క్రియేషన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus