కంటెస్టెంట్స్ విషయంలో కిందా మీదా పడుతున్నారు..!

  • July 6, 2019 / 04:01 PM IST

తెలుగు ప్రేక్షకులు ‘బిగ్ బాస్3’ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ కు నాగార్జున హోస్ట్ గా చేయనుండడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మొదటి సీజన్ ను జూ.ఎన్టీఆర్ హోస్ట్ గా చేసి సూపర్ హిట్ చేసాడు. ఇక రెండో సీజన్ ను నాని హోస్ట్ చేసాడు. ఇది కూడా సూపర్ హిట్టయ్యింది కానీ.. హోస్ట్ నాని కి మాత్రం ఈ బిగ్ బాస్ తన కెరీర్లోనే పెద్ద రిమార్క్ అని చెప్పాలి. ఇందులో కంటెస్టెంట్స్… చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో ‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడో సమస్య వచ్చి పడింది.

‘బిగ్ బాస్’ లో 100 రోజులు ఉండడానికి.. సెలబ్రిటీస్ ఎవ్వరూ ముందుకు రావడం లేదట. కాస్త పేరుగాంచిన సెలబ్రిటీలు వాళ్ళ షూటింగ్ లు ఆపుకుని అలాగే ఆఫర్లు కూడా మిస్ చేసుకోవడం అవసరమా అని అందరూ భావిస్తున్నారట. దీంతో మళ్ళీ చిన్న సెలబ్రిటీల వైపే ‘స్టార్ మా’ వారు దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇక జూలై 21 న ప్రారంభం కాబోతుంది ‘బిగ్ బాస్3’. మరి ఈ సీజన్ ఎలా ఉండబోతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus