బిగ్ బాస్ హౌస్ లో ఊహించని రీతిలో సింగర్ నోయల్ ఎలిమినేట్ అయిపోయాడు. నిజానికి లెగ్ పైయిన్ తో బయటకి వచ్చిన నోయల్ తిరిగి హౌస్ లోకి వచ్చేస్తారనే అనుకున్నారు అందరూ. కానీ తనకి ఇంకా రెస్ట్ కావాలని డాక్టర్స్ సలహాలని పాటిస్తూ స్వచ్ఛందంగా తనతంటతానే ఎలిమినేట్ అయిపోయాడు. అంతేకాదు, ఈవారం ఎలిమినేషన్ వద్దని బిగ్ బాస్ ని రిక్వస్ట్ కూడా చేశాడు. నిజానికి నోయల్ అలా రిక్వస్ట్ చేసి ఉండకపోతే ఖచ్చితంగా అమ్మరాజశేఖర్ మాస్టర్ ఎలిమినేట్ అయి ఉండేవారు.
లాస్ట్ వీక్ ఒకవారం ఇమ్యూనిటీ వస్తుందని తెలిసి, హాఫ్ షేవ్ చేస్కుని, హాఫ్ గుండు గీసుకుని తను గేమ్ లో ఎంత సీరియస్ గా ఉన్నానో ఆడియన్స్ కి తెలిసేలా చేశాడు అమ్మరాజశేఖర్. అయితే, సమంత వచ్చిన ఎపిసోడ్ లో ఎలిమినేషన్ తీసేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్మ గుండుకి అర్ధం లేకుండా పోయేది. అందుకే, ఈవారం ఎలిమినేషన్ ని నోయల్ ఎలాగో వెళ్లిపోయాడు కాబట్టి తీసేశారు.
ఎలిమినేషన్ నాటకీయతలో మెహబూబా ? అమ్మరాజశేఖరా ? అని హౌస్ మేట్స్ ని అడిగినపుడు ఒక్క అరియానా అవినాష్ లు తప్ప మిగతా వారందరూ కూడా అమ్మవద్దు అనే చెప్పారు. అంటే హౌస్ మేట్స్ కి కూడా ఈవారం అమ్మ వెళ్లిపోతాడని తెలిసినట్లగానే ఉంది. ఊహించారు కూడా. అందుకే అమ్మని ఎలిమినేట్ అని చెప్పి మరీ తర్వాత కాపాడారు. ఇక్కడ అమ్మని ఆపిన పాయింట్ మాత్రం కెప్టెన్సీ అనే చెప్పాలి. ఆ కెప్టెన్సీ టాస్క్ అమ్మని ఆపింది. నవ్వేలా చేసింది. నిజానికి అంతకుముందే మాస్టర్ కెెమెరా ముందుకు వచ్చి ఈసారి కెప్టెన్ అవ్వాలి., ఎవరు పోటీ వచ్చినా సరే సై అంటూ జబ్బలు చరిచారు. హాట్ స్టార్ అన్ సీన్ లో ఇది బిగ్ బాస్ లవర్స్ అందరూ చూశారు కూడా. అనుకున్నట్లుగానే కెప్టెన్సీ పోటీదారుడు అనేసరికి వెంటనే మాస్టర్ కూల్ అయ్యారు.
ఇక సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఏంటంటే, అమ్మరాజశేఖర్ మాస్టర్ ని ఎందుకు బిగ్ బాస్ టీమ్ రక్షిస్తోంది. కాపాడుతోంది. అని అడుగుతున్నారు. మరి లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది. అలాగే ఇప్పుడు కెప్టెన్ అయితే మళ్లీ ఇమ్యూనిటీ దొరుకుంది. ఆడియన్స్ అడిగేదాంట్లో అర్ధముంది కదా..! అదీ మేటర్.