Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: మాస్టర్‌ ఏడుపు… దివి అరుపు… కళ్యాణి ఔట్‌… నోయల్‌ ఏడుపు.. ఇంకా ఎన్నో

బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: మాస్టర్‌ ఏడుపు… దివి అరుపు… కళ్యాణి ఔట్‌… నోయల్‌ ఏడుపు.. ఇంకా ఎన్నో

  • September 20, 2020 / 10:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: మాస్టర్‌ ఏడుపు… దివి అరుపు… కళ్యాణి ఔట్‌… నోయల్‌ ఏడుపు.. ఇంకా ఎన్నో

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌కు మంచి టీఆర్‌పీ దక్కుతోందని నాగార్జున గర్వంగా ప్రకటించాడు. ఇప్పటివరకు వచ్చిన బిగ్‌బాస్‌ సీజన్లన్నింటిలో ఇదే బెస్ట్‌ అని చెప్పాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు బిగ్‌బాస్‌ చూశారని, చూస్తున్నారనీ తెలిపాడు నాగ్‌.

* ఈ వారం ఇద్దరు ఇంట్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అలాగా ఈ వారం ఇంటి నుంచి ఇద్దరు బయటకు వచ్చేస్తారని కూడా నాగార్జున ప్రకటించాడు. ఈ వారం పోలైన ఓట్ల సంఖ్య ఇంకా పెరిగింది. ఏకంగా ఆరు కోట్ల ఓట్లు పోలయ్యాయని కూడా చెప్పాడు.

* ఆరోగ్యం బాగాలేదంటూ, ఏసీ పడతలేదు.. నేను ఇంటికిపోతా అంటూ కంగారు పెట్టిన గంగవ్వ… మళ్లీ సెట్‌ అయిపోయింది. ఇంటి నుంచి వెళ్లేది లేదు అంటూ తేల్చేసింది.

* వంట గది దగ్గర కూర్చొని కూరల కట్ చేస్తూ.. ‘నేను ఈ పని చేయొచ్చు కదా’ అంటూ ఓ ప్రశ్న వేసింది కళ్యాణి. దానికి లాస్య ‘ఫర్వాలేదు చేయొచ్చు’ అని చెప్పింది. అయితే ‘గతంలో నన్ను ఆ పని చేయనివ్వలేదు’ అంటూ దేవీ సన్నాయి నొక్కులు నొక్కింది. దీంతో కళ్యాణికి కోపం వచ్చింది. నేనని మాటను నాకు ఆపాదించి.. నా మీద పగబట్టారు అంటూ రయ్యిన లేచింది. కూరలు కట్‌ చేయొద్దు అన్నందుకు ఏకంగా తిండి కూడా తినను అంటూ మొండిగా వాదించింది కళ్యాణి. ఆఖరికి ఏడ్చుకుంటూ అక్కణ్నుంచి వెళ్లిపోయింది.

* అభిజీత్‌తో మాట్లాడితే మోనాల్‌కు కోపం వస్తోందని అఖిల్‌కు సోహైల్ చెప్పాడట. ఆ విషయాన్ని అఖిల్‌.. మోనాల్‌ దగ్గర ప్రస్తావించాడు. అయితే ఇలాంటివి అలా విని ఇలా వదిలేయ్‌ అంటూ మోనాల్‌ మరోసారి అఖిల్‌కు క్లారిటీ ఇచ్చింది. ఇంటిలో నాకు క్లోజ్‌గా ఉండే, ఇష్టమైన వ్యక్తి మీరు అని మోనాల్‌ అఖిల్‌కు చెప్పింది.

* గంగవ్వ ఈ రోజు మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. అందరితోనూ సరదాగా మాట్లాడుతూ సందడి చేసింది. అవినాష్‌ మొదటి రోజు వచ్చిన సీన్‌ను గుర్తు చేసుకుంటూ.. అవినాష్‌ స్టైల్‌ను ఇమిటేట్‌ చేసింది. ‘బర్రె ముక్కు’ అంటూ పంచ్‌ కూడా వేసింది.

* ఒప్పొ ఎఫ్‌ 17 ప్రో మొబైల్‌ ప్రొమోషన్‌గా బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ ఇచ్చాడు. ఒప్పొ ఫోన్‌తో ఫొటోలు తీసే టాస్క్‌ పెట్టాడు. ఒప్పో ఫోన్‌లోని స్పెషల్‌ ఫీచర్లను ఉపయోగించి మంచి ఫొటోలు తీయడం ఈ టాస్క్‌ వర్క్‌. ఎవరి ఫొటోలు బాగుంటే వాళ్లదే గెలుపు.

* గంగవ్వను కన్ఫెషన్‌ రూమ్‌కి పిలిచి నాగార్జున మాట్లాడారు. ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ‘పిల్లల గురించి ఆలోచించడం, వాళ్లు గుర్తుకురావడం వల్లనే ఆ రోజు అలా అయిపోయా’ అంటూ గంగవ్వ చెప్పుకొచ్చింది. ఇప్పుడు అంతా బాగానే ఉందని, ఇంటికి వెళ్లాలని అనిపించడం లేదని గంగవ్వ చెప్పింది.

* పడవ నామినేషన్స్‌ ఫ్లాప్‌ అవ్వడం బిగ్‌బాస్‌కు , నాగార్జునకు నచ్చలేదు. ఆ మాటొస్తే జనాలకు కూడా నచ్చలేదు. ఆటలో సీరియస్‌నెస్‌ లేకుండా ఆడినందుకు నాగార్జున నామినేట్‌ అయిన అందరికీ క్లాస్‌ తీసుకున్నాడు. ‘సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారా… లేక జనాల దగ్గర సింపతీ కొట్టేయాలని చూస్తున్నారా’ అంటూ ఏకేశాడు నాగ్‌. ఈ క్రమంలో కుమార్‌ సాయికి పంచ్‌లు పడ్డాయి. ‘ఇంట్లోకి వెళ్లి ఎలాగూ ఎవరినీ నవ్వించడం లేదు. తిరిగి సీరియస్‌ టాపిక్‌ అప్పుడు నవ్వుతున్నావా’ అంటూ కుమార్‌సాయికి పంచ్‌ వేశాడు నాగ్‌.

* నామినేషన్‌ టైమ్‌లో గంగవ్వకు అర్థమయ్యేలా చెప్పి… ఆమె దిగిపోవడానికి కారణమైన నోయల్‌కు కూడా నాగ్‌ క్లాస్‌ పీకాడు. ‘నీ ఆట నువ్వు ఆడుకో’ అంటూ గట్టిగా చెప్పాడు. ఆడియన్స్‌ దగ్గర మార్కులు కొట్టేయడానికి త్యాగాలు చేస్తున్నట్లు ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు నాగ్. రియల్‌గా గేమ్‌ ఆడుతున్నవారికే ప్రేక్షకులు ఓట్లేస్తారు. ఆ విషయం గుర్తుంచుకొని ఆడండి అంటూ నాగ్‌ గట్టిగానే చెప్పాడు.

* మొత్తం తొమ్మిది మంది నుంచి తొలిగా సేఫ్‌ అయిన హౌస్‌మేట్‌గా గంగవ్వ పేరు ప్రకటించాడు నాగ్‌. ‘ఎవరి మాటా వినకుండా ఆడండి. మీరు బాగా ఆడుతున్నారు. మీకేదైనా అర్థం కాకపోతే బిగ్‌బాస్‌ను అడగండి. అప్పుడు మిమ్మల్ని కన్ఫెషన్‌ రూమ్‌కి పిలిచి బిగ్‌బాస్‌ చెబుతాడు. వీళ్ల మాట వినొద్దు’ అని గంగవ్వకు నాగ్‌ చెప్పాడు.

* పడవ నామినేషన్‌ టైమ్‌లో ఎవరికి వారు దిగిపోవాలి అనుకుంటున్నప్పుడు బిగ్‌బాస్‌ ‘మీలో మీరు నిర్ణయించుకొని నామినేట్‌ ప్రక్రియ సాగించండి’ అని చెప్పిన విషయం గుర్తుందిగా. అప్పుడు నోయల్‌ ‘బిగ్‌బాస్‌ మాట్లాడి బాంబు వేశాడు ఓలమ్మో… నామినేషన్‌ జోక్‌ కాదంటే..’ అంటూ పాడిన పాటపై నాగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సేఫ్‌ ఆడదామని మీరు అనుకుంటున్నా… నేను జరగనివ్వను అని నాగ్‌ కరాఖండిగా చెప్పేశాడు. మీరు సేఫ్‌ ఎలా అడతారో చూస్తా అన్నాడు నాగ్‌.

* ఇంట్లో సీరియస్‌ నెస్‌ తీసుకురావడానికి, డ్రామా పెరగడానికి నాగ్‌ ‘హీరో /జీరో’ టాస్క్‌ పెట్టాడు. ఇంట్లో ఉన్నవాళ్లలో హీరో అనుకున్నవాళ్లను కుర్చీలో కూర్చోబెట్టాలి. జీరో అనుకున్నవాళ్లను ‘జీరో’ డోర్‌ నుంచి బయటకు నెట్టేయాలి అని షరతు పెట్టాడు. అలా జీరో నుంచి బయటకు పంపించిన వాళ్లకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని అర్థం అని కూడా చెప్పాడు.

* నోయల్‌ లేచి అమ్మ రాజశేఖర్‌ను హీరో చేశాడు. బయట చాలా అచీవ్‌ చేసిన మాస్టర్‌, ఇంట్లోకి వచ్చి అందరితో కలసిపోతున్నాడు. అందరూ హ్యాపీగా ఉండేలా చూసుకుంటున్నారు. అందుకే అతను హీరో అని నోయల్‌ చెప్పాడు. అయితే ఆ వివరణకు నాగ్‌ అంగీకరించలేదు. దానిని కూడా సేఫ్‌ గేమ్‌ అనే అన్నాడు నాగ్‌. ఇక ఎవరో చెబితే నేను పడవ దిగిపోతాను అన్న కుమార్‌ సాయిని జీరోగా అభివర్ణించాడు నోయల్‌.

* ‘‘ఇంటికొచ్చిన కొత్తలో నా మీద కలిగిన అభిప్రాయాన్ని ఇంకా మనసులో ఉంచుకొని, నేను ఏ చిన్న మాట అన్నా తప్పుగా అనుకొని ఏడవడం, గట్టిగా అరవడం లాంటివి చేస్తున్నారు. ఆమెకు మాటలు వినేంత ఓపిక లేదు’’ అంటూ కళ్యాణిని జీరో చేసింది సుజాత. హీరోగా అమ్మ రాజశేఖర్‌ను పెట్టింది సుజాత. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది అమ్మ రాజశేఖర్‌కు తెలుసు. అందుకే ఆయన హీరో అని చెప్పింది.

* నోయల్‌ను హీరో చేశాడు సోహైల్‌. పడవ నామినేషన్‌ టైమ్‌లో ఇనీషియేటివ్‌ తీసుకొని ఎలాంటి గొడవలు లేకుండా మొత్తం ప్రాసెస్‌ జరిగిపోయింది అందుకే నోయల్‌ హీరో అన్నాడు సోహైల్‌. దానికి నాగ్‌ అంగీకరించలేదు. డిఫెండ్‌ చేయాల్సిన టైమ్‌లో శాక్రిఫైజ్‌ చేసేవాడు హీరోనా అంటూ ప్రశ్నించాడు నాగ్‌. కళ్యాణికి ఇంట్లో ప్రతివాళ్లతో ఇష్యూస్‌ వస్తుంటే.. వాళ్లతో డీల్‌ చేయకుండా పక్కకు వెళ్లి ఏడుస్తున్నారు. ఫేస్‌ చేయకుండా అలా వేరేవాళ్లకు చెప్పడం నచ్చలేదు అంటూ కళ్యాణిని జీరో చేశాడు సోహైల్‌.

* ట్రూ ఎట్‌ హార్ట్‌గా ఉన్న ఆరియానాను హీరోయిన్‌ చేసింది దేవీ నాగవల్లి. షో పిచ్చి కామెడీ ట్రాక్‌లా వెళ్తోంది అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది దేవీ. అతి సర్వత్రా వర్జయేత్‌ అంటూ వివరించే ప్రయత్నం చేసింది. ఆరియానా మీద అమ్మ రాజశేఖర్‌ పిచ్చి కామెడీ చేశారు అంటూ విమర్శలు చేసింది. ‘కామెడీలు చేస్తేనే ఇక్కడ హీరోలా’ అంటూ ప్రశ్నించింది. పక్షపాతం చూపిస్తున్నాడు అంటూ అమ్మ రాజశేఖర్‌ను జీరో చేసింది దేవీ నాగవల్లి. నామినేషన్స్‌ తర్వాత అందరూ నన్ను టార్గెట్‌ చేసేశారు. ఇప్పుడు నేను చేసిన ఈ పని (అమ్మ రాజశేఖర్‌ను జీరో చేయడం)తో విలన్‌ కూడా అయిపోవచ్చు. అయినా నేను భయపడను అంటూ తేల్చేసింది దేవీ.

* నా దృష్టిలో హీరోయిన్‌ లాస్య అని మెహబూబ్‌ చెప్పాడు. ఆమె తీసుకునే ప్రతి డెసిషన్‌ ఫుల్‌ క్లారిటీగా ఉంటారు. చిన్న చిన్న విషయాలు గొడవలుగా మారుతున్న సందర్భంలో వాటిని ఆమె ఆపే ప్రయత్నం చేశారు. అందుకే నా దృష్టిలో లాస్య ఈజ్‌ ఏ హీరో అని చెప్పాడు మెహబూబ్‌. అలాగే కుమార్ సాయిని జీరోగా అభివర్ణించాడు మెహబూబ్‌. నేను ఆయనతో మాట్లాడదామని ట్రై చేసినా ఆయన మాట్లాడలేదు.

* పడవ నామినేషన్‌ టైమ్‌లో నోయల్‌ అన్న మాటను పట్టుకొని కుమార్‌ సాయి అతనిని జీరో చేశాడు. ‘మేం ముందొచ్చాం… కలసి ఉన్నాం. నువ్వు ఇప్పుడే వచ్చావు కాబట్టి వెళ్లిపో’ అని నోయల్‌ అన్నాడంటూ ఆ రోజు జరిగిన విషయాన్ని గుర్తు చేశాడు కుమార్‌ సాయి. మరి ఆ మాటలు అప్పుడే ఎందుకు చెప్పలేదు నాగ్ అడిగాడు. గంగవ్వ కూడా అదే మాట అంది. ‘అప్పుడు నేను దిగొద్దు అని చెప్పినా నువ్వు దిగావు’ అంటూ గుర్తు చేసింది. ఇక హీరోగా అభిజీత్‌ను ఎంచుకున్నాడు కుమార్‌ సాయి. వ్యక్తిత్వం తెలియకుండా ఓ వ్యక్తిని నామినేట్‌ చేయడం అంటే గ్రూపిజం ఉన్నట్లే. ఆ సమయానికి ఆ గ్రూపునకు లాడర్‌ నోయల్‌ అని తేల్చేశాడు కుమార్‌ సాయి.

* హారిక కూడా అభిజీత్‌ను హీరోను చేసింది. నాకు ఏ అవసరం ఉన్నా, ఏం చెప్పాలన్నా అభిజీత్‌కే చెబుతాను. ఎందుకంటే అతను తొందరగా ఏదీ జడ్జ్‌ చేయడు. అలాగే కెప్టెన్సీ సమయంలో కూడా నాకు కొంచెం ఎక్స్‌పీరియన్స్‌ వచ్చాక తీసుకుంటాను అని చెప్పాడు. ఆ విధానం నచ్చింది. టాస్క్‌లో 100 శాతం ఇస్తున్నాడు. ఇక జీరో విషయానికొస్తే కుమార్‌ సాయిని ఎంచుకుంది హారిక. మేం దిగాలని అనిపిస్తే దిగమని కుమార్‌సాయికి చెప్పినా ఆయన వినలేదు. ఇంకొకటి ఆయనతో పని పెట్టుకుంటే తొందరగా క్లియర్‌ అవ్వదు. ఇంకొకటి ఇంట్లో ఆయన లేజీగా ఉంటున్నాడు అని హారిక చెప్పింది.

* తన దృష్టిలో గంగవ్వ హీరో అని లాస్య చెప్పింది. గంగవ్వ తీసుకున్న డెసిషన్స్‌ బాగా నచ్చుతాయి. ప్రతి విషయంలో క్లారిటీ ఉంటుంది కాబ్టటి గంగవ్వ హీరో. అమ్మ రాజశేఖర్‌ను జీరో అని చెప్పింది లాస్య. కామెడీకి ఒక లిమిట్‌ ఉంటుంది. శ్రుతి మించిన కామెడీని అందరూ యాక్సెప్ట్‌ చేయరు. నేనూ చేయలేను. అందుకే ఆయన జీరో అని చెప్పింది లాస్య. నిన్న జరిగిన ఒప్పో మొబైల్‌ టాస్క్‌లో దివి పొట్ట దగ్గర పిల్లో పెట్టడం నచ్చలేదు అని చెప్పింది లాస్య.

* ఇవన్నీ చూసిన అమ్మ రాజశేఖర్‌ ఎమోషనల్‌ అయ్యారు. ‘నేను వెళ్లిపోతాను’ అంటూ ఏడ్చేశాడు. నేనిక్కడ తప్పు చేస్తున్నాను అని అనుకుంటున్నారు. అందుకే నేను ఇక్కడ ఉండలేను అంటూ మాస్టర్‌ ఏడ్చేశారు. నాకు ఇప్పటివరకు వచ్చిన పేరు స్పాయిల్‌ అవ్వకూడదు. నేను ఇక్కడ జాలీగా ఆడదామని వచ్చాను. నన్ను పంపించేయండి అంటూ అమ్మ రాజశేఖర్‌ మాస్టర్ మోకాళ్ల మీద కూర్చొని ఏడ్చేశారు. అందరికీ అందరూ నచ్చాలి అనుకోవడం ఇంపాజిబుల్‌ అంటూ రాజశేఖర్‌ను నాగ్‌ ఊరడించే ప్రయత్నం చేశాడు. ‘నన్ను ఎవరూ మెడ మీద చెయ్యి పెట్టి నెట్టేయలేదు’ అంటూ బాధపడ్డాడు మాస్టర్‌. లాస్య వచ్చి కాళ్లకు నమస్కరించి.. క్షమించమని వేడుకుంది. అయితే మాస్టర్ ఇంట్లో ఉండాల్సిందే అని గంగవ్వ తేల్చి చెప్పేసింది. గంగవ్వ లేచి వచ్చి తన చీర కొంగుతో మాస్టర్‌ కన్నీళ్లు తుడిచింది గంగవ్వ.

* నా దృష్టిలో స్ట్రాంగ్‌ జీరో సుజాత అంటూ మెడ పట్టి జీరోలో పెట్టారు కళ్యాణి. మెప్పుకోసం మంచిగా మాట్లాడే రకం సుజాత అని వివరించింది. ఆమె కౌగిలింతలో నాకు కట్టప్ప కనిపిస్తున్నాడు. అలాగే గంగ్వనే ఈ ఇంట్లో హీరో. అన్ని విషయాల్లో కరెక్ట్‌గా ఉంటున్నారు. మా అందరినీ ఒకేలా చూస్తారు.

* అఖిల్‌ కూడా గంగవ్వనే హీరో చేశాడు. అందరూ చెప్పిన వివరణే చెప్పాడు. ఇక జీరోగా కుమార్‌ సాయిని ఎంచుకున్నాడు. కుమార్‌ స్థాయిలో ఎంటర్‌టైన్మెంట్‌ కనిపించడం లేదు. ఆయన ఈ ఇంటికి ఫిట్‌ కాడు అనిపిస్తోంది అనే వివరణ ఇచ్చాడు.

* ఇంట్లో అందరూ ఆడుతున్నారు… అయితే ఆడటానికి వచ్చాం. అయితే గంగవ్వ మాత్రం ఎంతో కేరింగ్‌గా ఉన్నారు. అందరినీ కేరింగ్‌గా చూస్తారు. అందుకే ఆమె నా హీరో. అలాగే కళ్యాణి జీరో అని ఆరియానా చెప్పింది. వంట గది విషయంలో, వడ్డన విషయంలో సరిగా లేనందున కళ్యాణిని జీరో చేసినట్లు చెప్పింది ఆరియానా.

* నా దృష్టిలో నవ్వించేవాడు హీరో.. అందుకే అమ్మ రాజశేఖర్‌ హీరో. అందరి బాధలను మరచిపోయేలా చేసే నవ్వించేవాడు హీరో అంటూ అమ్మ రాజశేఖర్‌ను పొగిడేశాడు అవినాష్. ఇక జీరోగా కుమార్‌ సాయిని జీరో చేశాడు. పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడం వల్ల కుమార్‌ సాయిని జీరో చేసినట్లు చెప్పాడు అవినాష్‌.

* హీరో/జీరో టాస్క్‌లో అసలు మజా ఇప్పుడు మొదలైంది. ఈ హౌస్‌లో నా హీరో అమ్మ రాజశేఖర్‌ అంటూ హీరో కుర్చీలో కూర్చోబెట్టింది దివి. ఆయన జెన్యూన్‌, పాజిటివ్‌, ఎంటరటైన్మెంట్‌. ఆయన ఇంట్లో లేకపోతే అందరికీ పిచ్చెక్కిపోద్ది. అందుకే ఆయన నా హీరో. ఇక షూట్‌ సమయంలో ఆయన చేసిన పని నాకు తప్పుగా అనిపించలేదు. ఆ ఫొటో షూట్‌ బాగా రావాలని ఆయన అలా చేశారు. ఒక డైరెక్టర్‌గా అది తప్పు కాదు. నాకు తప్పు అని కూడా అనిపించలేదు. ఆయన ఇంటెన్షన్ తప్పు కాదు. ఆయన వేసిన కొన్ని జోక్స్‌ నచ్చకపోవచ్చు. కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉన్న కుమార్ సాయిని జీరో అని చెప్పింది దివి.

* అమ్మ రాజశేఖర్‌ను గంగవ్వ హీరో చేసింది. ఆయన ఇంట్లో ఏ సామాన్లు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని పక్కాగా ఉంటాడు. అందరినీ నవ్విస్తారు. నోయల్‌ను రొయ్యలా అంటూ నవ్వించేసింది గంగవ్వ. పడవ నుంచి తను వద్దన్నా దిగిపోయిన కుమార్‌సాయిని జీరో చేసింది గంగవ్వ.

* జీవితంలో ఎంతో పోరాడిన గంగవ్వను హీరో అని ఎంచుకున్నాడు అభిజీత్‌. ఆరియానాను జీరో చేశాడు అభిజీత్‌.

* ఎక్కువమంది హీరో ట్యాగ్‌ వేసిన రాజశేఖర్‌… తన హీరోగా నోయల్‌ను ఎంచుకున్నాడు. ఎవరినైనా ఏడిపించాలి అంటే రెండు దెబ్బలేస్తే ఏడుస్తారు. అదే నవ్వించాలంటే అంత సులభం కాదు. దానికి రియల్‌నెస్‌ యాక్టింగ్‌ ఉండాలి. అందుకే నోయల్‌ హీరో. అలాగే తనకు జీరో ట్యాగ్‌ వేసిన దేవీకి అమ్మ రాజశేఖర్‌ జీరో ట్యాగ్‌ వేశాడు. ‘ఆమెకు నాకు ఏం గొడవ లేదు. నేను ఎప్పుడు ఎంటర్‌టైన్‌ చేసినా ఆమె వచ్చి నవ్వేది. మేం జాలీగా ఉన్నప్పుడు పక్కనే ఉండి నవ్వేవారు. ఆ తర్వాత ఏదో విషయానికి హర్ట్‌ అయ్యేవారు’ అంటూ వివరించాడు మాస్టర్‌. మొన్న బీబీ కామెడీ షో సందర్భంగా కూడా ఆమెకు పెద్ద క్యారెక్టర్‌ ఇచ్చాం. కానీ ఆమె జరగని వాటిని మనసులో పెట్టుకొని నా మీద కోపం పెట్టుకున్నారు అని మాస్టర్‌ వివరించాడు.

* మోనాల్‌ కూడా గంగవ్వను హీరో చేసింది. ఆమె గురించి అందరూ చెప్పిందే మోనాల్‌ చెప్పింది. ఇక జీరోగా కుమార్‌సాయినే ఎంచుకుంది. అందరితో కలవడం లేదనే కారణం చెప్పింది.

 

* నాగార్జున బ్రేక్‌ తీసుకున్న సమయంలో అమ్మ రాజశేఖర్‌ను అందరూ సముదాయించే ప్రయత్నం చేశారు. కళ్యాణి ముందుకొచ్చి మాస్టర్‌ను కూల్‌ చేసింది. అదే సమయంలో లాస్య ఏదో మాట్లాడదామని ముందుకొచ్చింది. అప్పుడే దివి కూడా రియాక్ట్‌ అయ్యింది. నా విషయంలో మాస్టర్‌ చేసిన పనిని నువ్వెందుకు మాట్లాడావు అంటూ లాస్యను అడిగింది. నీ విషయాలు నువ్వు మాట్లాడుకోవాలి కానీ… నా విషయం ఎందుకు చర్చకు తెచ్చావు అని అడిగింది. మా ఇంట్లో వాళ్లు చూస్తుంటారు… నా విషయంలో నువ్వెందుకు రియాక్ట్‌ అవ్వడం అంటూ లాస్యతో కోపంగా అంది దివి. దానికి లాస్య ఏదో చెప్పబోతుంటే ‘షటప్‌’ అంటూ వెళ్లిపోయింది. దీంతో లాస్యకు కోపం వచ్చి ‘మైండ్‌ యువర్‌ టంగ్‌’ అంటూ గట్టిగా అంది. అక్కడితో ఆగకుండా ఆ యాటిట్యూడ్‌ ఏంటి అంటూ దివిపై కోపం చూపించింది.

 

* గంగవ్వ సేఫ్‌ అయినట్లు ముందుగా ప్రకటించిన నాగ్‌… కరాటే కళ్యాణి ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. ఆమెను ఆదివారం స్టేజీ పైకి వస్తుందని నాగ్‌ ప్రకటించిన ఈ రోజుకు సెలవు తీసుకున్నాడు.

* నాగ్‌ వెళ్లిపోయాక కూడా ఎపిసోడ్‌ కంటిన్యూ అయ్యింది. స్టోర్‌ రూమ్‌లో మొబైల్‌ తీసుకురావడానికి వెళ్లిన నోయల్‌ అక్కడే కాసేపు ఉండి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదెందుకో రేపు తెలుస్తేందేమో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

11 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

14 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

17 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

18 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

19 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version