Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4 – 19వ రోజు రివ్యూ : కెప్టెన్సీ టాస్క్‌ ఫట్‌… లగ్జరీ బడ్జెట్‌ ఔట్‌… గంగవ్వ హిట్!

బిగ్‌బాస్‌ 4 – 19వ రోజు రివ్యూ : కెప్టెన్సీ టాస్క్‌ ఫట్‌… లగ్జరీ బడ్జెట్‌ ఔట్‌… గంగవ్వ హిట్!

  • September 26, 2020 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4 – 19వ రోజు రివ్యూ : కెప్టెన్సీ టాస్క్‌ ఫట్‌… లగ్జరీ బడ్జెట్‌ ఔట్‌… గంగవ్వ హిట్!

‘ఉక్కు హృదయం’ టాస్క్‌ తర్వాత ఇంట్లో ఏ మూల చూసినా హాట్‌ డిస్కసనే నడించింది. అయితే 19వ రోజు ఎపిసోడ్‌ మాత్రం కాస్త భిన్నంగా సాగింది. పేరుకే 19వ రోజు ఎపిసోడ్‌కానీ… ఇందులో 18వ రోజు, 19 రోజు చూపించేశారు. అంటే రెండు రోజుల ఫుటేజ్‌ ఒకే రోజు చుట్టేశారు. ఇంకా ఈ రోజు ఏం చూపించారు.. ఎపిసోడ్‌ ఎలా సాగిందో చూద్దాం. దివి రోబోను కిడ్నాప్‌ చేసి అభిజీత్‌ రోబో ఛార్జింగ్‌ పెట్టుకోవడం విషయంలో ఈ రోజు చర్చ జరిగింది. ‘అమ్మాయిలందరూ పట్టుకొని వాళ్లు ఛార్జింగ్‌ పెట్టుకోకుండా నువ్వెందు పెట్టుకున్నావ్‌’ అంటూ దివి, అమ్మ రాజశేఖర్‌ అభిజీత్‌ను అడిగారు.

‘అమ్మాయిలు నిన్ను పట్టుకొని ఉండి ఛార్జింగ్‌ పెట్టుకోలేరు కదా’ అని అభి అన్నాడు. అయితే ‘హారిక లాస్ట్‌లో ఛార్జింగ్‌ పెట్టుకుంది కదా’ అంటూ దివి అడిగింది. దీనికి అభిజీత్‌ దగ్గర సమాధానం లేదు. సమాధానం దొరకడం కష్టం కూడా. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్‌తో మాట్లాడి… టాస్క్‌ వల్ల వచ్చిన దూరాన్ని తగ్గించుకున్నాడు. ఇది కదా ‘జెంటిల్‌మన్‌ గేమ్‌’. దివి రోబోను కిడ్నాప్‌ చేసిన సందర్భంలో ఇంటి బయట ఉన్న మనుషుల టీమ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ని గంగవ్వ ఇమిటేట్‌ చేసి చూపించింది. గంగవ్వలో మంచి యాక్టర్‌ ఉందని అందరికీ తెలిసిందే. ఆ టాలెంట్‌తోనే చింపి ఆరేసింది.

అంతకుముందు కెమెరాతో ఓ చిన్న ఆట కూడా ఆడింది. జైలుకెళ్లిన నాయకులు బయటకు వచ్చినప్పుడు అభిమానగణం చేసిన సందడి మనం బయట చూస్తుంటాం కదా… అలానే నోయల్‌ జైలు నుంచి విడుదల కాగానే హౌస్‌ మేట్స్‌ అలాంటి సందడే చేశారు. గంగవ్వ చాలా అమాయకంగా కనిపిస్తుంది కానీ… ఇంట్లో ఏం జరుగుతుందో చాలా బాగా తెలుసు. మోనాల్‌, అఖిల్‌ సరిగ్గా మాట్లాడుకోవడం లేదని పసిగట్టేసింది. ఆ విషయాన్ని అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌, అవినాష్‌తో చెప్పింది. అభిజీత్‌, మోనాల్ మాట్లాకుంటున్నారు అనీ… దివి, అఖిల్‌ మధ్య మాటలు పెరిగాయనీ తన అబ్జర్వేషన్‌ చెప్పి ఆశ్చర్యపరిచింది గంగవ్వ. బాబోయ్‌ అవ్వ… వహ్వా అనిపిస్తోంది.

Bigg Boss 4 Telugu Rangu padindhi jagratha task

ఇంట్లో సభ్యులు సరిగ్గా నియమాలు పాటించడం లేదనే విషయం మనకు తెలిసిందే. కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. ఇంగ్లీష్, హిందీ మాట్లాడుతుండటం, నియమాలు పాటించడకపోవమూ చూశాం. దీంతో బిగ్‌ బాస్‌ కన్నెర్ర చేశాడు. ఏకంగా ఈ వారం కష్టపడి ఆడి సాధించిన లగ్జరీ బడ్జెట్‌ పాయింట్లకు కోత విధించాడు. దీంతో హౌస్‌మేట్స్‌ అందరూ లేచి నిలబడి సారీ చెప్పారు. ఒక్క దేవీ నాగవల్లి తప్ప. పైగా అదేదో ఆమే బాగా ఆడుతున్నట్లు ‘చేతల్లో చూపించండి’ అంటూ సలహా కూడా ఇచ్చింది. ‘ఉక్కు హృదయం’ టాస్క్‌ సమయంలో తన మైక్‌ని ఆరియానాకు ఇవ్వడం, మోనాల్‌తో ఇంగ్లీష్‌లో మాట్లాడం మరచిపోయినట్లుంది దేవీ నాగవల్లి.

మోనాల్‌ విషయంలో అఖిల్‌ ఓవర్‌ కేర్‌ చూపిస్తున్నాడో, లేక రిస్ట్రిక్ట్‌ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఆమె ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అనేది నిర్ణయించే పరిస్థితి ఏర్పడింది. వైల్డ్‌ కార్డుగా స్వాతి దీక్షిత్‌ వచ్చి గార్డెన్‌ ఏరియాలో డ్యాన్స్‌ వేస్తుండగా.. మోనాల్‌ చిన్న స్టెప్పులేసింది. అయితే అఖిల్‌ మోనాల్‌ను డ్యాన్స్‌ వేయకుండా ఆపేశాడు. ఎందుకోమరి అఖిల్‌ ఇలా చేస్తున్నాడు. ఇంత చేసినా మోనాల్‌కు నచ్చుతోంది. ఆ తర్వాత పార్టీ టైమ్‌లో అఖిల్‌కు టిఫిన్‌ పెట్టింది కూడా.

Bigg Boss Telugu 4 Swathi Deekshith Entry

ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌గా బిగ్‌బాస్‌ ‘రంగుపడుద్ది జాగ్రత్త’ టాస్క్‌ ఇచ్చాడు. కెప్టెన్సీ పోటీలో ఉన్న అభిజీత్‌, గంగవ్వ, అవినాష్‌, హారికకు రంగునీళ్లు ఉన్న బౌల్స్‌ ఉన్న ఇచ్చారు. టాస్క్‌ ముగిసేసమయానికి ఎవరి బౌల్‌లో ఎక్కువ నీళ్లు ఉంటే వాళ్లు గెలిచినట్లు. అంటే కెప్టెన్‌ అయినట్లు అర్థం. అత్యంత చప్పగా సాగిన ఈ టాస్క్‌లో గంగవ్వ కెప్టెన్‌గా ఎంపికైంది.

Click Here-> కెప్టెన్సీ టాస్క్‌: ‘రంగు పడుద్ది జాగ్రత్త’ రివ్యూ

వైల్డ్‌ కార్డుగా ఇంట్లోకి వచ్చిన స్వాతి దీక్షిత్‌ని మగవాళ్లు మెప్పిస్తే ఓ సర్‌ప్రైజ్‌ ఇస్తా అంటూ బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇచ్చాడు. దీంతో ఒక్కొక్కరు పెద్ద ప్రేమికుల్లా కవితలు, పాటలతో రంగంలోకి దిగిపోయారు. అఖిల్‌, రాజశేఖర్‌, నోయల్‌, అవినాష్‌కు స్వాతి దీక్షిత్‌ రోజాపువ్వు ఇచ్చి ఓటేసింది. దీంతో వాళ్ల కోసం కోసం బిగ్‌బాస్‌ లాంజ్‌ ఓపెన్‌ చేశాడు.

Click Here-> స్వాతిని మెప్పించడానికి ఎవరేం చేశారంటే?

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

SSMB29: మహేష్‌ బాబు చెప్పిందే నిజమైంది.. విలనే ముందొస్తున్నాడు!

SSMB29: మహేష్‌ బాబు చెప్పిందే నిజమైంది.. విలనే ముందొస్తున్నాడు!

The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Santhana Prapthirasthu Trailer:  ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

Santhana Prapthirasthu Trailer: ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

The Great Pre-Wedding Show Review in Telugu: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా రివ్యూ & రేటింగ్!

The Great Pre-Wedding Show Review in Telugu: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

Mohan Babu: ‘శివ’ లో మోహన్ బాబు? ఎందుకు మిస్ అయినట్టు?

Mohan Babu: ‘శివ’ లో మోహన్ బాబు? ఎందుకు మిస్ అయినట్టు?

నాగార్జున–బాలయ్యతో బ్లాక్‌బస్టర్ హిట్స్.. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్!

నాగార్జున–బాలయ్యతో బ్లాక్‌బస్టర్ హిట్స్.. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్!

Divvala Madhuri: ‘బిగ్ బాస్ 9’.. 8వ వారం హౌస్ నుండి మాధురి ఔట్?

Divvala Madhuri: ‘బిగ్ బాస్ 9’.. 8వ వారం హౌస్ నుండి మాధురి ఔట్?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

trending news

SSMB29: మహేష్‌ బాబు చెప్పిందే నిజమైంది.. విలనే ముందొస్తున్నాడు!

SSMB29: మహేష్‌ బాబు చెప్పిందే నిజమైంది.. విలనే ముందొస్తున్నాడు!

2 hours ago
The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Santhana Prapthirasthu Trailer:  ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

Santhana Prapthirasthu Trailer: ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ రివ్యూ.. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ కట్

15 hours ago
Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

Baahubali-The Epic: రీ రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి’ రికార్డ్

16 hours ago
Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

Mass Jathara Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మాస్ జాతర’.. కానీ?

16 hours ago

latest news

NTRNEEL: నీల్ డ్రాగన్.. ఇది డ్యామేజ్ కంట్రోలా?

NTRNEEL: నీల్ డ్రాగన్.. ఇది డ్యామేజ్ కంట్రోలా?

17 hours ago
Ravi Teja: మాస్ రాజా రెమ్యూనరేషన్: 25 కోట్ల నుంచి జీరోకి.. క్లిక్కయితే లాభమే?

Ravi Teja: మాస్ రాజా రెమ్యూనరేషన్: 25 కోట్ల నుంచి జీరోకి.. క్లిక్కయితే లాభమే?

17 hours ago
Jatadhara First Review: ‘జటాధర’ ఫస్ట్ రివ్యూ.. ఈసారైనా సుధీర్ బాబు హిట్టు కొట్టాడా?

Jatadhara First Review: ‘జటాధర’ ఫస్ట్ రివ్యూ.. ఈసారైనా సుధీర్ బాబు హిట్టు కొట్టాడా?

19 hours ago
The Girlfriend First Review: ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ రివ్యూ.. రష్మిక ఖాతాలో ఇంకో హిట్టు గ్యారెంటీనా?

The Girlfriend First Review: ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ రివ్యూ.. రష్మిక ఖాతాలో ఇంకో హిట్టు గ్యారెంటీనా?

19 hours ago
కె.జి.ఎఫ్ నటుడు మృతి!

కె.జి.ఎఫ్ నటుడు మృతి!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version