Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » కెప్టెన్సీ టాస్క్‌: ‘రంగు పడుద్ది జాగ్రత్త’ రివ్యూ

కెప్టెన్సీ టాస్క్‌: ‘రంగు పడుద్ది జాగ్రత్త’ రివ్యూ

  • September 26, 2020 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కెప్టెన్సీ టాస్క్‌: ‘రంగు పడుద్ది జాగ్రత్త’ రివ్యూ

ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌గా బిగ్‌బాస్‌ ‘రంగుపడుద్ది జాగ్రత్త’ టాస్క్‌ ఇచ్చాడు. కెప్టెన్సీ పోటీలో ఉన్న అభిజీత్‌, గంగవ్వ, అవినాష్‌, హారికకు రంగునీళ్లు ఉన్న బౌల్స్‌ ఉన్న ఇచ్చారు. టాస్క్‌ ముగిసేసమయానికి ఎవరి బౌల్‌లో ఎక్కువ నీళ్లు ఉంటే వాళ్లు గెలిచినట్లు. అంటే కెప్టెన్‌ అయినట్లు. ఈ సీజన్‌లో కెప్టెన్సీ కోసం జరిగిన ఈ టాస్క్‌ ఎలా సాగిందంటే? అఖిల్‌ సంచాలకుడిగా వ్యవహరించిన ఈ టాస్క్‌ను కూడా ఇంటి సభ్యులు చప్పగా సాగించేశారు.

‘ఇంట్లో వద్దు బయటకు వెళ్లిపోదాం’ అంటూ అభిజీత్ చెప్పడం ఆలస్యం అందరూ బయటకు వచ్చేశారు. తొలుత అభిజీత్‌ బౌల్‌ను దివి నెట్టేసే ప్రయత్నం చేసింది. కొద్దిగా నీళ్లు కిందపడ్డాయి. ఆ తర్వాత సోహైల్‌, దివి కలసి అభి బౌల్‌లో నీళ్లు మొత్తం కింద పడేసేలా చేశారు. మరోవైపు అవినాష్‌ బౌల్‌లో నీళ్లను నోయల్‌ ఒక్క అటెంప్ట్‌లోనే కింద పడిపోయేలా చేశాడు. అవినాష్‌, అభిజీత్‌ బౌల్స్‌ ఖాళీ అవ్వడంతో హారిక, గంగవ్వ మాత్రమే పోటీలో నిలిచారు.

హారిక ఓ మూలకు చేరి కాసేపు బౌల్‌లో నీళ్లు పడకుండా చూసుకుంది. కానీ అమ్మ రాజశేఖర్‌, సోహైల్‌, నోయల్‌ కలసి నీళ్లు కిందపడేశారు. దీంతో చుక్క నీళ్లు కింద పడేయకుండా ఉన్న గంగవ్వ గెలచింది. కొత్త కెప్టెన్‌ అయ్యింది. గెలుపు సంబరాల్లో గంగవ్వ కూడా హుషారుగా ఆడింది. రంగునీళ్లు చల్లుతూ హుషారు చూపించింది.

ఇక టాస్క్‌ జరిగిన తీరు చూస్తే…

గత మూడు బిగ్‌బాస్‌ సీజన్లలో ఇలాంటి టాస్క్‌లు మనం చూశాం. బౌల్‌లో నీళ్లు ఇవ్వడం, లేదంటే ఏదైన లిక్విడ్‌ ఇవ్వడం లాంటి టాస్క్‌లు జరిగాయి. అయితే ప్రతిసారి పోటీతత్వం కనిపించింది. నీళ్లు పడిపోకుండా ఉండటానికి చాలా ప్రయత్నించారు. కానీ ఈసారి అలాంటిదేం కనిపించలేదు. కారణం కెప్టెన్సీ సపోర్టు చేసేవాళ్లు లేకపోవడం. ఒక్క గంగవ్వకు మాత్రమే సపోర్టు కనిపించింది. ఒకక్క కుమార్ సాయి మాత్రమే అవినాష్‌ కాస్త సపోర్టు చేశాడు. మిగిలినవాళ్లు ఎప్పుడు మిగిలిన ముగ్గురు పార్టిసిపెంట్స్‌ను ఓడించడమే పనిగా పెట్టుకున్నారు.

ఓడించడానికి చూసినవాళ్లందరూ మొన్న ‘ఉక్కు హృదయం’ టాస్క్‌లో ఓడిపోయిన మనుషుల టీమ్‌ సభ్యులే. మరి గెలిచిన టీమ్‌ సభ్యులు ఏం చేశారు అంటే సమాధానం కష్టమే. సపోర్టు చేయాలని అనిపించలేదా? లేక అందరూ కలసి గంగవ్వను గెలిపించాలని చూశారా? ఈ రెండూ కాకుండా టాస్క్‌ను తొందరగా ముగించేసి మనం వేరే పని చూసుకుందాం అనుకున్నారా? అనేది అర్థం కావడం లేదు. అభిజీత్‌, అవినాష్‌ కనీసం గెలవడానికి ప్రయత్నమే చేయలేదు. హారిక ఆ మాత్రం ఫర్వాలేదనిపించింది. ఏదో నీళ్లు పడకుండా కాసేపు ప్రతిఘటించింది. బిగ్‌బాస్‌ ఆడండిరా బాబూ అని టాస్క్‌లు ఇస్తుంటే వీళ్లు ఇలా బొక్క బోర్లా పడేస్తున్నారు. నాగార్జునగారూ.. ఇది చూస్తున్నారా? ఈ వారం ఏమైనా అడుగుతారా?

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

related news

trending news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

1 hour ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

2 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

2 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

3 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

3 hours ago

latest news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

4 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

5 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

6 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

6 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version