Bigg Boss 5 Telugu: నోటికి వచ్చినట్లుగా వికీపీడియా పేజీని మార్చేస్తున్న నెటిజన్లు!

  • September 24, 2021 / 04:18 PM IST

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ మొదలై 20 రోజులే అయ్యింది. ఇంట్లో ఇప్పుడిప్పుడే జనాలు కుదురుకొని, ఎవరి రంగేంటి అనేది బయటపడుతోంది. జనాలు కూడా ఎవరికి ఓటేయాలి, ఎవరిని ఫైనల్‌ వరకు తీసుకురావాలి అనేది చూస్తున్నారు. అయితే జనాలు చెప్పేలా… జరుగుతుందా అంటే అది వేరే విషయం. ఓవైపు ప్రేక్షకులు ఈ పనిలో ఉంటే… మరోవైపు నెటిజన్లు వేరే పనిలో ఉన్నారు. కొంతమంది నెటిజన్లు ఏకంగా బిగ్‌బాస్‌ 5 విన్నర్‌ను కూడా ఫిక్స్‌ చేసేశారు. ఇంతకీ ఏమైందంటే…

గూగుల్‌లో సెర్చ్‌లో biggboss telugu season 5 winner అని సెర్చ్‌ చేసి చూడండి. ….. ఏంటి ట్రై చేసి చూశారా? మీకే పేరు కనిపిస్తోందో తెలియదు కానీ.. మేం ఈ వార్త రాస్తున్నప్పుడు అక్కడ లోబో పేరు కనిపించింది. పైన ఫొటోలో ఉన్నది ఆ డీటైల్సే. అదేంటి అప్పుడే లోబోను విన్నర్‌ని చేసేశారా అనుకోవద్దు. ఎందుకంటే ఇది అధికారిక సమాచారం కాదు. కొంతమంది నెటిజన్లు వికీపీడియా పేజీని మార్చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇదే జరుగుతోంది.

గూగుల్‌ సెర్చ్‌లో రెండు రోజుల నుండి బిగ్‌బాస్‌ విన్నర్‌ అని సెర్చ్‌ చేస్తుంటే… ఇలా తప్పులు తప్పులుగా చూపిస్తోంది. తొలుత బిన్నర్‌ సింగర్‌ శ్రీరామ్‌చంద్ర అని వచ్చింది. ఆ తర్వాత కొంతమందికి వీజే సన్నీ అని కూడా చూపించిందట. ఇంకొంతమందికి ప్రియాంక సింగ్‌ పేరు కూడా వచ్చిందట. ఇప్పుడు లోబో. ఇలా చూసుకుంటే పోతే రోజుకో విన్నర్‌ను సెట్‌ చేస్తారేమో. దీనిపై వికీపీడియా, గూగుల్‌ ఏం చేస్తాయో చూడాలి.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus