Shaakuntalam: బిగ్ బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్.. చైతన్య ఫ్యాన్స్ వల్లే అంటూ?

బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న ఆరోహి రావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. శాకుంతలం సినిమాకు ఆమె రివ్యూ ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. శాకుంతలం సినిమాలో ల్యాగ్ కొంచెం ఉందని నేను కూడా ఆ విషయాన్ని అంగీకరిస్తానని ఆమె అన్నారు. పురాణాలు తెలియని వాళ్లకు శాకుంతలం మూవీ పంచతంత్రం కథలా అనిపిస్తుందని అరోహిరావు చెప్పుకొచ్చారు.

శాకుంతలం (Shaakuntalam) సినిమాలో సమంత అభినయం బాలేదని ఎవరైనా చెబితే వాళ్లు కచ్చితంగా చైతన్య ఫ్యాన్స్ అని ఆరోహి రావు కామెంట్లు చేశారు. శాకుంతలం సినిమా కథను ఉన్నది ఉన్నట్టుగా తీశారని ఆమె చెప్పుకొచ్చారు. శాకుంతలం కథలో ఫిక్షన్ ఉండి మసాలా యాడ్ చేసి ఉంటే సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండేదని ఆరోహి రావు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. శాకుంతలం సినిమాలో అర్హ చాలా బాగుంది కానీ అర్హ కన్నా అద్భుతంగా చేస్తూ అవకాశాల కోసం చూసేటోళ్లు చాలామంది ఉన్నారని ఆరోహి రావు కామెంట్లు చేశారు.

నా వరకు ఈ సినిమా యావరేజ్ సినిమానే తప్ప ఫ్లాప్ సినిమా కాదని ఆమె చెప్పుకొచ్చారు. ఆరోహి రావు కామెంట్ల విషయంలో చైతన్య ఫ్యాన్స్, అర్హ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సమంతను సపోర్ట్ చేయడంలో తప్పు లేదని చైతన్యను టార్గెట్ చేయొద్దని కామెంట్లు చేస్తున్నారు. శాకుంతలం సినిమా వల్ల 14 కోట్ల రూపాయల రేంజ్ లో నష్టాలు వచ్చాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకుని కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. సమంత లుక్ పై పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. సమంత రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సమంతకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus