ప్రెగ్నెన్సీ టైంలో స్త్రీలు బరువు పెరుగుతారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. డెలివరీ అయ్యాక వాళ్ళ మొహంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. సామాన్యుల విషయంలో ఇలాంటి మార్పులు వాళ్ళ బంధువులు తప్ప మిగిలిన వాళ్ళు పట్టించుకోరు. కానీ సినిమాల్లో నటించే వాళ్ల విషయంలో ఇలా ఉండదు. వాళ్ళ పై నెటిజన్ల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వాళ్లలో కొంచెం మార్పులు వచ్చినా నెగిటివ్ కామెంట్స్ చేయడానికి సిద్ధంగా ఉంటారు.
ఇప్పుడు ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ విషయంలో అదే జరుగుతుంది. వివరాల్లోకి వెళితే.. పూజా రామచంద్రన్ అందరికీ సుపరిచితమే. ‘లవ్ ఫెయిల్యూర్’, ‘స్వామి రారా’, ‘దోచేయ్’, ‘గంగ’,’కృష్ణార్జున యుద్ధం’, ‘త్రిపుర’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.’బిగ్ బాస్ 2′(తెలుగు)తో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది.ఈమె పర్సనల్ లైఫ్ కూడా అందరికీ సుపరిచితమే. మొదట విజె క్రేప్గ్ ను 2010 లో పెళ్లి చేసుకున్న (Bigg Boss Beauty) ఈమె.. తర్వాత మనస్పర్థల కారణంగా అతనితో విడిపోయింది.
అటు తర్వాత 2019 లో విలన్ పాత్రలు చేసే జాన్ కొక్కెన్ ను వివాహం చేసుకుంది.‘సార్పట్ట’ ‘కె.జి.ఎఫ్’ ‘వీరసింహారెడ్డి’ సినిమాల్లో విలన్ గా చేసి ఇతను బాగా పాపులర్ అయ్యాడు. ఇక ఈ దంపతులు ఈ మధ్యనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. కియాన్ కొక్కెన్ అంటూ తమ బిడ్డకు నామకరణం చేశారు ఈ దంపతులు. అయితే పూజా తాజాగా బికినీ ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. దీనితో నెటిజన్లు ఈమె పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.