పెళ్ళైన జంటలే కుదురుగా ఉండడం లేదు. ఇట్టే విడిపోతున్నారు. ఇక ప్రేమలో ఉన్న జంటలకు, డేటింగ్ లో ఉన్న జంటలకు ఏమైనా అడ్డు ఉంటుందా? అస్సలు ఉండదు. ఈ రెండిటికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి… కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న జంట కాస్త ప్రత్యేకం.బాలీవుడ్ నటీనటులు షిమితా శెట్టి, రాకేశ్ బాపత్ .. హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో అడుగుపెట్టారు. విడి విడిగా హౌస్ లోకి కంటెస్టెంట్లుగా వెళ్లిన వీరు.. తర్వాత జంటగా బయటకు వచ్చారు.
పార్టీలకు, డిన్నర్లకు తెగ వెళ్లారు. ఫైనల్ గా పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు. హద్దు అదుపు లేకుండా విచ్చలవిడిగా తిరిగేసిన వీరు.. విడిపోయారు అంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయాన్ని వారు వెంటనే కన్ఫర్మ్ చేయలేదు. దీంతో అవి అసత్య ప్రచారాలు అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే అవే నిజం అని చెప్పి అందరికీ షాకిచ్చారు. ఈ విషయాన్ని ముందుగా.. షమితా శెట్టి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
“ఈ విషయం పై మీకు క్లారిటీ ఇవ్వడం ముఖ్యమని అనుకుంటున్నాను.నేను రాకేశ్ కొంతకాలంగా కలిసి ఉండటం లేదు. ఇకపై కూడా ఉండబోము. మా దారులు వేరు.ఈ విషయం మాకు కూడా కొంతకాలం క్రితమే తెలిసింది. మాపై మీరు చూపించిన ప్రేమ, అభిమానానికి కృతజ్ఞురాలిని. ఇకపై కూడా ఇలాగే వేరువేరుగా మాపై ప్రేమ చూపిస్తారని కోరుకుంటున్నాను’ అంటూ షమితా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొంది. ఇక రాకేశ్ బాపత్ కూడా ‘మా దారులు వేరంటూ’ బ్రేకప్ ని కన్ఫర్మ్ చేశాడు.
ఇక షమితా శెట్టి శిల్పా శెట్టి సోదరి అని ఎక్కువ మందికి తెలిసుండదు. తెలుగులో ఆమె ‘పిలిస్తే పలుకుతా’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. దివంగత స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా బాగానే ఆడింది, షమితా శెట్టి లుక్స్ కు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ తర్వాత ఆమెకు ఎక్కువ అవకాశాలు రాలేదు.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!