దేత్తడి హారికగా యూ ట్యూబ్ లో ఒక వండర్ క్రియేట్ చేసిన ఆలేఖ్య హారిక ఆ తరువాత పలు షార్ట్ ఫిలిమ్స్ లో మెరిసిన విషయం తెలిసిందే. ఎలా కనిపించినా కూడా పక్కా లోకల్ మాస్ పిల్ల అన్నట్లుగా క్రేజ్ అందుకుంది. ఇక బిగ్ బాస్ ద్వారా అమ్మడు మరింత క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. సీజన్ 4లో కంటెస్టెంట్ గా వెళ్లి ఫైనల్స్ వరకు వచ్చి ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
ఫైనల్స్ వరకు బాగానే పోరాడిన హారిక చివరి దశలో అనుకోకుండా ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయినప్పటికీ ఈ బ్యూటీకి కావాల్సినంత క్రేజ్ అయితే దక్కింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే గ్లామరస్ హాట్ ఫొటో షూట్స్ తో షాక్ ఇచ్చింది. నిత్యం ఏదో ఒక రకంగా తన సొగసులతో కుర్రాళ్ళ మైండ్ ను డిస్టర్బ్ చేసేస్తోంది. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోల్లో అయితే అసలు అమ్మడు గుర్తు పట్టని విదంగా మారిపోయినట్లు అనిపించింది.
అలాగే మునుపటి కంటే కూడా కాస్త నాజూగ్గా మారినట్లు తెలుస్తోంది. ఇక ఫొటోలోకి స్టిల్ ఇవ్వడంలో కూడా చాలా విభిన్నంగా ఆలోచిస్తోంది. ఏకంగా నాడుమందలను యధేచ్చగా ఆరబోస్తూ చీర చిక్కుల్లో పువ్వును కూడా జత చేసింది. గతంలో ఎన్నో రకాల గ్లామర్ లుక్స్ తో షాక్ ఇచ్చిన హారిక ఈసారి మాత్రం నెవర్ బిఫోర్ అనేలా కిక్కిచ్చిందని ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ గ్లామర్ అమ్మడు భవిష్యత్తులో ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి.