Priyanka Jain: ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న ప్రియాంక జైన్!

  • January 8, 2024 / 09:40 AM IST

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి బుల్లితెర నటి ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మౌన రాగం, జానకి కలగలేదు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో 15 వారాలు పాటు కొనసాగుతూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చారు.

ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె తన ప్రియుడు శివకుమార్ తో కలిసి ఎన్నో వీడియోలను చేస్తున్నారు. ఇక వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రశ్నలు ఎదురు కావడంతో ఈ ఏడాది మేము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ పెళ్లి గురించి తెలిపారు. ఇకపోతే వీరి యూట్యూబ్ చానెల్ ద్వార ఒక వీడియోను షేర్ చేశారు.

ఈ వీడియోలో భాగంగా శివ కుమార్ మాట్లాడుతూ ప్రియాంక సర్జరీ రూంలో ఉందని, తానూ సర్జరీ చేయించుకుంటే తనకు టెన్షన్ గా ఉందని తెలిపారు. తాను కళ్ళకు సర్జరీ చేయించుకుంటుందని శివకుమార్ తెలిపారు. గత కొద్ది రోజులుగా ఈమె సైట్ కారణంగా ఇబ్బంది పడుతుందని తెలిపారు. తనకు సెవెంత్ క్లాస్ నుంచే సైట్ ఉందని అయితే ఇప్పుడు కాస్త ఎక్కువ కావడంతో లెన్సెస్ వాడుతుందని తెలిపారు. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసమే ఈ సర్జరీ చేయించుకుంటుంది.

ఈ విధంగా ప్రియాంక జైన్ కంటికి సర్జరీ చేయించుకుంటుంది. ఆమెకు సర్జరీ జరుగుతుంటే నాకు కాస్త టెన్షన్ గా ఉంది అంటూ శివకుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే వీరిద్దరూ మౌనరాగం సీరియల్ లో కలిసిన నటించారు. అప్పటినుంచి ప్రేమలో ఉన్నారు. ఇలా ఇన్ని సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus