Sohel: వైరల్ అవుతున్న బిగ్ బాస్ సోహెల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • December 12, 2023 / 12:13 PM IST

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా సోహెల్ ద్వారా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. అయితే సోహెల్ అమర్ దీప్ ను సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అమర్ దీప్ ఫేక్ కాదు చాలా జెన్యూన్ అంటూ సోహెల్ చెప్పుకొచ్చారు. అమర్ దీప్ పై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో సోహెల్ సోషల్ మీడియా ద్వారా అమర్ దీప్ వ్యక్తిగతంగా నాకు తెలుసని పేర్కొన్నారు.

తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా సోహెల్ ఈ విషయాలను వెల్లడించారు. అమర్ దీప్ మంచి వ్యక్తి అని బిగ్ బాస్ షో ఎప్పుడు ఎందుకు ఎలా రియాక్ట్ అవుతామో చెప్పలేమని సోహెల్ కామెంట్లు చేశారు. నా వ్యక్తిగత అనుభవం ద్వారా ఈ విషయం చెబుతున్నానని ఆయన అన్నారు. రోలర్ కోస్టర్ ఎలా ఉంటుందో బిగ్ బాస్ షో అలానే ఉంటుందని సోహెల్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

ఎవరి అభిప్రాయాలు వాళ్లవని కొంతమందికి కోపం ఉంటుందని కొంతమందికి ఓపిక ఉంటుందని అమర్ ఐతే నాకు తెలిసి ఫేక్ గా లేడని సోహెల్ కామెంట్లు చేశారు. బూట్ కట్ బాలరాజు ట్రైలర్ ఎలా ఉందో చూసి చెప్పాలని సోహెల్ అన్నారు. సోహెల్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సోహెల్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రం సోహెల్ పై ఫైర్ అవుతున్నారు. (Sohel) సోహెల్ హౌస్ లో ఉన్న సమయంలో ప్రశాంత్ ఎంతగానో సపోర్ట్ చేశారని అయినప్పటికీ సోహెల్ మాత్రం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సోహెల్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus