బిగ్ బాస్ కార్యక్రమం అనేది కొంతమందికి ఎంతో ప్రయోజనకరంగా మారగా మరికొందరికి పూర్తిస్థాయిలో వారి కెరియర్ కు డామేజ్ చేస్తుంది అనే సంగతి మనకు తెలిసిందే. ఇప్పటివరకు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారంతా కూడా బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లి పెద్ద ఎత్తున నెగిటివిటీ మూట కట్టుకొని బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు ఇక ఈ సీజన్లో కూడా అలాంటి కంటెస్టెంట్లు ఉన్నారు అని చెప్పాలి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్లు పాల్గొన్నటువంటి వారిలో బిగ్ బాస్ (Priyanka Jain) ప్రియాంక శోభ శెట్టి ఒకరు. వీరిద్దరూ పలు సీరియల్స్ లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రియాంక ఎన్నో సీరియల్స్ చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ లో చేశారు. ఇక శోభా శెట్టి మాత్రం విలన్ పాత్రలలో నటించారు. వీరిద్దరూ బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత వీరి అసలు రంగు బయటపడింది.
వీరిలో దాగి ఉన్నటువంటి అసలు క్యారెక్టర్స్ బయటపడటంతో సీరియల్స్ లో ఇంత మంచిగా నటించిన వీరిద్దరి రియల్ క్యారెక్టర్స్ ఇదేనా అంటూ చాలామంది ఆశ్చర్యపోయారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరికి ఎలాంటి క్యారెక్టర్స్ ఇచ్చిన ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట వీళ్ళిద్దరికీ తెలుగులో ఎలాంటి అవకాశాలు రాలేదని తెలుస్తుంది.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో వీరి వ్యవహార శైలి కారణంగా భారీ స్థాయిలో నెగిటివిటీ మూట కట్టుకున్నారని తద్వారా వీరి కెరియర్ పై భారీ ఎఫెక్ట్ చూపుతోందని తెలుస్తుంది. ఇక వీరికి తెలుగులో అవకాశాలు లేకపోతే ఇద్దరు కూడా కన్నడ వెళ్ళిపోవాల్సిందేనని లేదంటే యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోలు చేసుకుంటూ ఉండాల్సిందేనని పలువురు వీరి కెరియర్ పై కామెంట్స్ చేస్తున్నారు.