బిగ్‌బాస్ కొత్త సీజన్ గురించి ఇంకా సరైన స్పష్టత రావడం లేదు. ఓసారి బిగ్‌బాస్ 5 పనులు మొదలయ్యాయని, ఇంకొకసారి ఇంకా మొదలు కాలేదు అంటున్నారు. ఓసారేమో బిగ్‌బాస్ టీమ్ ఇంటర్వ్యూలు మొదలుపెట్టిందంటున్నారు. ఇంకొకసారేమో మొత్తం లిస్ట్ రెడీ అయిపోయింది అంటున్నారు. ఈ మాటల్లో ఏది నిజం, ఏది కాదో తెలియదు కానీ… బిగ్‌బాస్ ఓపెనింగ్ తేదీ ఇదేనంటూ… ఓ డేట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. బిగ్‌బాస్ గత సీజన్ అంటే బిగ్‌బాస్ 4 మొదలైన తేదీకి దగ్గరలోనే కొత్త బిగ్‌బాస్‌ను ప్రారంభించాలని అనుకుంటున్నారట.
అంటే బిగ్‌బాస్ నాలుగో సీజన్‌ను సెప్టెంబరు 6న ప్రారంభించారు. ఈసారి సెప్టెంబరు 5న ప్రారంభిస్తారని సమాచారం. ఆ రోజు ఆదివారం అనే విషయాన్ని కొత్తగా చెప్పక్కర్లేదు. దీనికి సంబంధించి నాగార్జునతో ఇంట్రెస్టింగ్ ప్రోమోలు సిద్ధం చేయాలని చూస్తున్నారట. ఇక బిగ్‌బాస్ ఇంటిలోకి ఎంటర్ అయ్యేది ఎవరు అనే విషయంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో ఏది నిజం, ఏది కాదనేది తేలాల్సి ఉంది. ఒకటి మాత్రం పక్కా ఏంటంటే..
ఈ సారి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను ఎక్కువమంది తీసుకోవాలని చూస్తున్నారట. ఇంట్లోకి వచ్చి ఫేమస్ అయినవారి కంటే ఫేమస్ అయినవారిని ఇంటిలోకి పంపాలని బిగ్‌బాస్ టీమ్ చూస్తోందట.